Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 5:7 - పవిత్ర బైబిల్

7 యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు. యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములో ప్రవేశించెదను నీయెడల భయభక్తులుకలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 నేనైతే నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. భయభక్తులు కలిగి నీ పవిత్రాలయం వైపు వంగి నమస్కరిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 కాని నేనైతే మీ మారని ప్రేమను బట్టి మీ మందిరంలోనికి రాగలను; మీ పరిశుద్ధాలయం వైపు తిరిగి నేను భక్తితో నమస్కరిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 కాని నేనైతే మీ మారని ప్రేమను బట్టి మీ మందిరంలోనికి రాగలను; మీ పరిశుద్ధాలయం వైపు తిరిగి నేను భక్తితో నమస్కరిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 5:7
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

“మరి కొన్ని సార్లు వారు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే, వారి భూముల్లో వర్షం కురియకుండా నీవు చేస్తావు. వారు మరల ఈ ప్రదేశానికి వచ్చి నిన్ను ప్రార్థించి, స్తుతిస్తారు. నీవు వారిని బాధించినప్పుడు, వారు చేసిన పాపాలకు వారు పశ్చాత్తాపం పొందుతారు.


వీటిలో ఏదైనా జరిగినప్పుడు, ఏ ఒక్కడైనా జరిగిన దానికి పశ్చాత్తాపపడి, చేతులు చాచి ఈ దేవాలయంలో నిలబడి నీకు ప్రార్థన చేస్తే,


అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను. అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.


యెహోవా, నీ ప్రజలను క్షమించుము. అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.


మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి. దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.


దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను. నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను. నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.


యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను. నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము. నా మీద దయ చూపించుము.


ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు. ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.


దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా నా మీద దయ చూపించుము. నీ మహా దయ మూలంగా నా పాపాలన్నీ తుడిచివేయుము.


అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను. నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.


నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను. యెహోవా నాకు జవాబు ఇస్తాడు.


నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన. నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను. దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.


యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము. నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము.


ఈ ఆరు విషయాలను యెహోవా అసహ్యించుకొంటాడు: కాదు ఏడును ఆయన అసహ్యించుకొంటాడు.


ఇతరులకంటే తానే మంచివాడు అనుకొనే మనిషి. అబద్దాలు చెప్పే మనిషి. నిర్దోషులను చంపే మనిషి.


దుర్మార్గులు వారి దుర్మార్గ జీవితాలు విడిచిపెట్టాలి. వారు తమ దురాలోచనలు నిలిపివేయాలి. వారు తిరిగి యెహోవా దగ్గరకు రావాలి. అప్పుడు యెహోవా వారిని ఆదరిస్తాడు. మన దేవుడు క్షమిస్తాడు గనుక ఆ మనుష్యులు యెహోవా దగ్గరకు రావాలి.


మా పవిత్ర ఆలయం అగ్నిచేత కాల్చి వేయబడింది. ఆ ఆలయం మాకు ఎంతో గొప్పది. మా తండ్రులు అక్కడ నిన్ను ఆరాధించారు. మాకు ఉండిన మంచి వస్తువులన్నీ ఇప్పుడు నాశనం చేయబడ్డాయి.


దానియేలు ప్రతిరోజూ మూడు సార్లు మోకరిల్లి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఈ క్రొత్త చట్టం గురించి దానియేలు విని, తన ఇంటికి వెళ్లి, తన ఇంటిమీద ఉన్న గదిలో యెరూషలేము వైపుగా తెరచివున్న కిటికీ వద్ద ఎప్పుడూ చేసే విధంగా, మోకరిల్లి దేవుణ్ణి ప్రార్థించాడు.


దీని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వెనుకకు వస్తారు. వారు వారి దేవుడైన యెహోవా కోసం, వారి రాజైన దావీదు కోసం వెతుకుతారు. చివరి దినాల్లో వారు యెహోవాను, ఆయన మంచితనాన్నీ గౌరవిస్తారు.


ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహం పొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.


అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి.


“అయితే ఒకవేళ యెహోవాను సేవించటం మీకు ఇష్టం లేదేమో. అది ఈ వేళే మీరు తేల్చుకోవాలి. మీరు ఎవరిని సేవిస్తారో నేడే నిర్ణయించుకోవాలి. మీ పూర్వీకులు నదికి ఆవల నివసించినప్పుడు సేవించిన దేవుళ్లను మీరు సేవిస్తారో? లేదా ఈ దేశంలో నివసించిన అమోరీయుల దేవుళ్లను సేవిస్తారో? మీకు మీరే కోరుకోండి. అయితే, నేను, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాము!”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ