కీర్తన 5:10 - పవిత్ర బైబిల్10 దేవా! వారిని శిక్షించుము. వారి ఉచ్చులలో వారినే పట్టుబడనిమ్ము. ఆ మనుష్యులు నీకు విరోధంగా తిరిగారు కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 దేవా, వారు నీమీద తిరుగబడియున్నారువారిని అపరాధులనుగా తీర్చుము.వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాకవారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 దేవా, వాళ్ళను అపరాధులుగా ప్రకటించు. వాళ్ళ పథకాలే వాళ్ళ పతనానికి కారణం అగు గాక! అసంఖ్యాకమైన వారి అతిక్రమాలనుబట్టి వాళ్ళను తరిమి కొట్టు. ఎందుకంటే వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేశారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఓ దేవా! వారిని దోషులుగా ప్రకటించండి, వారి పన్నాగాలే వారి పతనానికి కారణం అవ్వాలి. వారు చేసిన అనేక పాపాలను బట్టి వారిని వెళ్లగొట్టండి, వారు మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఓ దేవా! వారిని దోషులుగా ప్రకటించండి, వారి పన్నాగాలే వారి పతనానికి కారణం అవ్వాలి. వారు చేసిన అనేక పాపాలను బట్టి వారిని వెళ్లగొట్టండి, వారు మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. အခန်းကိုကြည့်ပါ။ |
ప్రవక్త చెప్పటం ముగించాక, అమజ్యా ప్రవక్తతో యిలా అన్నాడు: “మేము నిన్ను రాజుకు సలహాదారుగా ఎన్నడూ నియమించలేదే! నీవు మాట్లడవద్దు! నీవు నోరు మూయకపోతే నీవు చంపబడతావు!” ప్రవక్త మౌనం వహించాడు. తరువాత ప్రవక్త మళ్లీ యిలా అన్నాడు: “దేవుడు నిన్ను నాశనం చేయటానికే నిశ్చయించాడు. నీవు అటువంటి నీచకార్యాలు చేయటంతో పాటు, నా సలహా కూడ పెడచెవిని పెట్టావు.”
“ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో. శిక్షా సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు నీవు ప్రతిఫలం చెల్లించాల్సిన సమయం వచ్చింది” అని ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, “ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల విషయంలో మీరు శిక్షించబడతారు. మీద్వేషం మూలంగా మీరు శిక్షించబడుతారు” అని ప్రవక్త చెపుతున్నాడు.