Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 48:9 - పవిత్ర బైబిల్

9 దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 48:9
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

కావున రాజుతో రాణి ఇలా అన్నది, “నీవు చేసే పనుల గురించి, నీ ప్రజ్ఞా ప్రభావాల గురించి నేను నా దేశంలో చాలా విన్నాను. నేను విన్నవన్నీ నిజమని తేలింది!


నేనిక్కడికి వచ్చి స్వయంగా నా కళ్లతో నేను చూచే వరకు నేను విన్నవన్నీ నిజమని నమ్మలేదు. ఇప్పుడు నేను విన్న దానికంటె ఎక్కువ ఉన్నట్లు చూశాను. నీ తెలివి తేటలు, నీ సిరిసంపదలను గురించి ప్రజలు నాకు చెప్పినదాని కంటె అవి అతిశయించి వున్నాయి.


నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.


నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను. నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.


యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను. ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను. యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను. నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.


సీయోనుగడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును. సర్వోన్నతుడైన దేవుడు ఆ పట్టణాన్ని నిర్మించాడు.


నన్ను ఆకర్షించుకొనుము! మేము నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాము! రాజు తన రాజ గృహానికి నన్ను తీసుకు వెళ్ళాడు. మేము ఆనందిస్తాం. నీకోసం సంతోషంగా ఉంటాం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా బాగుంటుందని జ్ఞాపకముంచుకొనుము. మంచి కారణంతోనే యువతులు నిన్ను ప్రేమిస్తారు.


కానీ యెహోవా, మేము నీ న్యాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నాం. నిన్ను, నీ నామాన్ని మా ఆత్మలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాయి.


శవాలను, బూడిదను పడవేసిన లోయ అంతా యెహోవాకు పవిత్రమైనదిగా ఉంటుంది. తూర్పున వున్న కిద్రోను లోయకు ఎగువనున్న భూములన్ని గుర్రాల ద్వారం వరకు అన్నీ కలపబడుతాయి. యెరూషలేము నగరం మరెన్నడు విచ్ఛిన్నం చేయబడదు. నాశనం చేయబడదు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ