Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 48:2 - పవిత్ర బైబిల్

2 దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది. అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది. సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం. అది మహారాజు పట్టణం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 అది మన దేవుని మహా పట్టణం. ఉత్తరం వైపున ఉన్న సీయోను పర్వతం. దాని ఉచ్ఛ దశ ఎంతో సుందరంగా ఉంది. అది భూమి అంతటికీ ఆనందదాయకంగా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 మహారాజు పట్టణమైన సీయోను పర్వతం సాఫోన్ ఎత్తైన స్థలంలా అందంగా కనిపిస్తూ సర్వలోకానికి ఆనందం కలిగిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 మహారాజు పట్టణమైన సీయోను పర్వతం సాఫోన్ ఎత్తైన స్థలంలా అందంగా కనిపిస్తూ సర్వలోకానికి ఆనందం కలిగిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 48:2
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి, యెహోవా స్తుతించబడును గాక! యెహోవాను స్తుతించండి!


సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.


దేవుని ఆలయం షాలేములో ఉంది. దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.


దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబుతారు.


మన దేవుడైన యెహోవాను స్తుతించండి. ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి. మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.


నీలో నీవు ఎల్లప్పుడూ ఇలా చెప్పుకొన్నావు: “సర్వోన్నతుడైన దేవునిలా నేనూ ఉంటాను. పైన ఆకాశాల్లోకి నేను వెళ్లిపోతాను. నేను, నా సింహాసనాన్ని దేవుని నక్షత్రాలకంటె పైకి హెచ్చిస్తాను. పరిశుద్ధ సభా పర్వతం మీద నేను కూర్చుంటాను. దాగియున్న ఆ కొండ మీద దేవుళ్లను నేను కలుసుకొంటాను.


యెహోవా ఆలయం ఒక కొండమీద ఉంది. చివరి రోజుల్లో ఆ కొండ, పర్వతాలన్నింటిలో ఎత్తయినదిగా చేయబడుతుంది. ఆ పర్వతం కొండల శిఖరాలన్నింటికంటె ఎత్తు చేయబడుతుంది. అన్ని రాజ్యాల ప్రజలూ అక్కడికి వెళ్తారు.


గతంలో ప్రజలు నిన్ను బాధించారు. ఆ ప్రజలు నీ ఎదుట సాష్టాంగపడతారు. గతంలో ప్రజలు నిన్ను ద్వేషించారు. ఆ ప్రజలు నీ పాదాల దగ్గర సాగిలపడతారు. ‘యెహోవా పట్టణం’ అని ‘ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోను’ అనీ ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు.


యెరూషలేమా, సంతోషించు! యెరూషలేమును ప్రేమించే మీరందరూ సంతోషించండి. విచారకరమైన విషయాలు యెరూషలేముకు సంభవించాయి. కనుక మీరు కొంతమంది మనుష్యులు విచారించారు. కానీ, అలాంటి మీరు ఇప్పుడు ఎంతో ఎంతో సంతోషించాలి.


యెహోవానైన నేనిలా అనుకున్నాను, “మిమ్మల్ని నా స్వంత బిడ్డలవలె చూసుకోవటం నాకు సంతోషదాయకం. మీకో మంచి రాజ్యాన్నివ్వటం వాకు తృప్తినిస్తుంది. ఆ రాజ్యం ఇతర రాజ్యాలకంటె సుందరంగా ఉంటుంది. మీరు నన్ను ‘తండ్రీ’ అని పిలుస్తారనుకున్నాను. మీరు నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తారని అనుకున్నాను.


మార్గమున పోవు వారు నిన్ను చూసి విస్మయంతో చేతులు చరుస్తారు. యెరూషలేము కుమార్తెను చూచి వారు ఈలవేసి తలలు ఆడిస్తారు. “‘అపురూప అందాల నగరం’ అనీ, ‘భూనివాసులకు ఆనంద దాయిని’ అని ‘ప్రజలు పిలిచే నగరం ఇదేనా’?” అని వారడుగుతారు.


ఆ రోజున మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి, నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి నడిపిస్తానని వాగ్దానం చేశాను. ఆది చాలా మంచి వస్తువులున్న దేశం. దేశాలన్నిటిలోకి అది సుందరమైనది!


“తన ఇష్టము వచ్చినట్లు ఉత్తర రాజు చేస్తాడు. ఎవ్వరూ అతనిని విరోధించలేరు. అతను అధికారం పొంది, సుందర దేశాన్ని అదుపులో ఉంచుకొంటాడు. మరియు అతనికి దాన్ని నాశనం చేసే శక్తికూడా ఉంటుంది.


సుందరమైన పరిశుద్ధ పర్వతానికి, సముద్రానికి మధ్య అతను రాజవైభవంగల గుడారాలు నెలకొల్పుతాడు. చివరికి అతడు నిస్సహాయుడై మరణిస్తాడు.


తర్వాత ఆ నాలుగు కొమ్ములలో ఒకదానినుండి ఒక చిన్న కొమ్ము పెరిగి బాగా పెద్దదయింది. అది దక్షిణ దిక్కుగా, తూర్పు దిక్కుగా, సుందర దేశం దిక్కుగా పెరిగింది.


కొంతమంది దగ్గర వారు బలి అర్పణలుగా ఇవ్వగలిగిన మంచి మగ జంతువులు ఉన్నాయి. కానీ ఆ మంచి జంతువులను వారు నాకు ఇవ్వరు. కొంతమంది మంచి జంతువులను నాకోసం తీసికొని వస్తారు. ఆరోగ్యంగా ఉన్న ఆ జంతువులను నాకు ఇస్తాం అని వారు వాగ్దానం చేస్తారు. కానీ వారు ఆ మంచి జంతువులను రహస్యంగా మార్చివేసి, జబ్బు జంతువులను నాకు ఇస్తారు. ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. నేను మహారాజును. మీరు నాయెడల భయభక్తులు కలిగి ఉండాలి. ప్రపంచం అంతటా ప్రజలు నాయందు భయభక్తులు కలిగి ఉంటారు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.


“ఇతర రాజ్యాల ప్రజలు మీ యెడ దయగలిగి ఉంటారు. నిజంగా మీకు ఒక అద్భుత దేశం ఉంటుంది.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.


భూమి దేవుని పాదపీఠం కనుక భూమ్మీద ప్రమాణం చెయ్యకండి. యెరూషలేము మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చెయ్యకండి.


కాని మీరు సీయోను పర్వతం దగ్గరకు వచ్చారు. ఇదే పరలోకపు యెరూషలేము! సజీవుడైన దేవుని నగరం. ఆనందంతో సమూహమైన వేలకొలది దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ