Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 40:6 - పవిత్ర బైబిల్

6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు. బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు. దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహనబలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 నీకు బలులన్నా, నైవేద్యాలన్నా సంతోషం ఉండదు. అయితే నువ్వు నా చెవులు తెరిచావు. దహన బలులుగానీ పాపం కోసం చేసే బలులు గానీ నీకు అక్కర లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నా చెవులు తెరిచారు, హోమాలు పాపపరిహార బలులు మీరు కోరలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నా చెవులు తెరిచారు, హోమాలు పాపపరిహార బలులు మీరు కోరలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 40:6
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుడు చేసే ఆశ్చర్యకరమైన వాటిని మనుష్యులెవ్వరు గ్రహించలేరు. దేవుడు చేసే అద్భుతాలకు అంతం లేదు.


దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం. నీకు ఎంతో తెలుసు.


వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి. కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.


నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.


నీవు బలులు కోరటం లేదు. లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.


నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబుతాను. నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబుతాను. లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు.


ఇలా కనుక జరిగితే యజమాని ఆ బానిసను దేవుని దగ్గరకు తీసుకరావాలి. తలుపు దగ్గరకు గాని, ద్వార బంధం దగ్గరకు గాని యజమాని ఆ బానిసను తీసుకు రావాలి. యజమాని ఏదైనా పదునుగల పరికరాన్ని ప్రయోగించి, ఆ బానిస చెవికి రంధ్రం చేయాలి. అప్పుడు బానిస జీవితాంతం ఆ యజమానినే సేవిస్తాడు.”


దేవుడు అంటున్నాడు: “ఇంకా ఎందుకు మీరు నాకు బలులు అర్పిస్తూనే ఉన్నారు? మీ మేకల బలులు, దూడల కొవ్వు, గొర్రెలు, మేకలు నాకు వెక్కసం అయ్యాయి.


యెహోవా, నీవు నా దేవుడివి నిన్ను నేను ఘనపరుస్తాను, నీ నామం స్తుతిస్తాను. అద్భుతమైన కార్యాలు నీవు చేసావు. చాలాకాలం క్రిందట నీవు చెప్పిన మాటలు పూర్తిగా సత్యము. నీవు జరుగుతుందని చెప్పినట్టు సమస్తం జరిగింది.


కొంతమంది నాకు బలులు ఇచ్చేందుకు ఎడ్లను వధిస్తారు. కానీ వారు ప్రజల్నికూడా కొడతారు. ఆ మనుష్యులు నాకు బలులు ఇచ్చేందుకని గొర్రెలను వధిస్తారు. అయితే వారు కుక్కల మెడలు కూడ విరుగగొడ్తారు. మరియు పందుల రక్తం వారు నాకు అర్పిస్తారు. ఆ మనుష్యులు ధూపం వేయటం జ్ఞాపకం ఉంచుకొంటారు. కాని పనికిమాలిన వారి విగ్రహాలను కూడా వారు ప్రేమిస్తారు. ఆ మనుష్యులు నా మార్గాలను గాక వారి స్వంత మార్గాలనే ఎంచుకొంటారు. భయంకరమైన వారి విగ్రహాలనే వారు పూర్తిగా ప్రేమిస్తారు.


ఎందుచేతనంటే, నాకు కావల్సింది నమ్మకమైన ప్రేమయే. అంతేగాని బలిఅర్పణ కాదు. ప్రజలు నన్ను తెలుసుకోవాలని నా కోరిక దహనబలులు తీసుకొని వచ్చేందుకు కాదు.


మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా, నేను వాటిని స్వీకరించను! మీరు సమాధాన బలులుగా అర్పించే బలిసిన జంతువులవైపు నేను కనీసం చూడనైనా చూడను.


‘నాకు దయకావాలి, బలికాదు’ అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసివుంటే మీరు అమాయకుల్ని అవమానించే వాళ్ళు కాదు.


‘నేను కోరేది దయ, జంతువుల బలినికాదు’ అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.


కానీ సమూయేలు, “యెహోవాకు ఎక్కువ ప్రీతి పాత్రమైనది ఏమిటి? దహనబలులు, బలులా? లేక యెహోవా ఆజ్ఞాపాలనయా? దేవునికి బలులు అర్పించటంకంటే, ఆయనకు విధేయుడై ఉండటం శ్రేష్ఠము. పొట్టేళ్ల కొవ్వును అర్పించేకంటే, దేవుని వాక్కు వినటం శ్రేష్ఠము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ