Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 27:5 - పవిత్ర బైబిల్

5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు. ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు. ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ఆపద కాలంలో ఆయన తన పర్ణశాలలో నాకు ఆశ్రయం ఇస్తాడు. తన గుడారం చాటున నన్ను కప్పుతాడు. ఉన్నతమైన ఆశ్రయశిల మీద ఆయన నన్ను ఉంచుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ఆపద సంభవించిన దినాన ఆయన తన ఆశ్రయంలో నన్ను క్షేమంగా ఉంచుతారు; తన పవిత్ర గుడారంలో ఆయన నన్ను దాచిపెడతారు, ఎత్తైన బండ మీద నన్ను నిలుపుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ఆపద సంభవించిన దినాన ఆయన తన ఆశ్రయంలో నన్ను క్షేమంగా ఉంచుతారు; తన పవిత్ర గుడారంలో ఆయన నన్ను దాచిపెడతారు, ఎత్తైన బండ మీద నన్ను నిలుపుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 27:5
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆలయంలో ఆరు సంవత్సరాల పాటు యోవాషు యాజకుల వద్ద దాచబడ్డాడు. ఆ సమయంలో అతల్యా పరిపాలన కొనసాగింది.


యెహోవా, నీవెందుకు అంత దూరంగా ఉంటావు? కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు.


నన్ను దాచిపెట్టి, కాపాడుము. యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.


దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము. నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.


నీ కంటిపాపవలె నన్ను కాపాడుము. నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.


దేవుడు నా కాళ్లను లేడి కాళ్లవలె ఉంచుతాడు. ఆయన నన్ను స్థిరంగా ఉంచుతాడు. ఎత్తయిన బండలమీద పడకుండా ఆయన నన్ను కాపాడుతాడు.


మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు. ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు. కాని ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.


యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు. ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.


నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు. ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు. ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు. ఆయన నా పాదాలను స్థిరపరచాడు.


ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను యెహోవా నా నోట ఉంచాడు. నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు. వారు యెహోవాను నమ్ముకొంటారు.


దేవుడు మా ఆశ్రయం, మా శక్తి. ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.


“ఇశ్రాయేలు ప్రజలారా, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి! నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”


దేవా, నన్ను కరుణించు నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము. కష్టం దాటిపోయేవరకు నేను నీ శరణు జొచ్చియున్నాను.


నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా, సహాయం కోసం నీకు మొరపెడతాను. ఎత్తయిన క్షేమస్థలానికి నన్ను మోసికొనిపొమ్ము.


నీవే నా క్షేమ స్థానం. నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే.


నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను. రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను. నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.


నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు. నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.


మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.


నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు. నేను వారికి జవాబు ఇస్తాను. వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.


యెహోవా పేరులో ఎంతో బలం ఉంది. అది బలమైన ఒక దుర్గంలాంటిది. మంచివాళ్లు ఆ దుర్గం దగ్గరకు పరుగెత్తి వెళ్లి, క్షేమంగా ఉంటారు.


యెహోవా, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొంటారు. నీవు ప్రజలను శిక్షించినప్పుడు వారు మౌన ప్రార్థనలు నీకు చేస్తారు.


నా ప్రజలారా, మీ గదుల్లోకి వెళ్లండి. తలుపులకు తాళాలు వేసుకోండి. కొద్దికాలం పాటు మీ గదుల్లో దాక్కోండి. దేవుని కోపం తగ్గేంతవరకు దాక్కోండి.


ఇలా జరిగితే, అప్పుడు గాలివాన నుండి దాగుకొనే చోటులా ఉంటాడు ఆ రాజు. అది ఎండిన భూమిలో నీటి కాలువలు ప్రవహించినట్టుగా ఉంటుంది. వేడి ప్రదేశంలో ఒక పెద్ద బండ చాటున చల్లని నీడలా ఉంటుంది అది.


“ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ