Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 18:2 - పవిత్ర బైబిల్

2 యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు. నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను. దేవుడు నా డాలు, ఆయనే తన శక్తితో నన్ను రక్షిస్తాడు. ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము, నా బలమైన కోట.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము, నా బలమైన కోట.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 18:2
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

సహాయంకొరకు నేనాయనను ఆశ్రయిస్తాను! ఆయన నా రక్షణ దుర్గం! దేవుడు నా రక్షణ స్థలం! ఆయన శక్తి నన్ను రక్షిస్తుంది! యెహోవా నా ఉన్నత దుర్గము ఆయన నా భద్రమైన తావు. నాకు కీడు రాకుండా కాపాడే రక్షకుడు!


యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం.


ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను. నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.


యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం. యెహోవా నన్ను రక్షిస్తాడు, యెహోవా నా కేడెం. నేను ఆయనను నమ్ముతాను. నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు.


నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.


యెహోవా, నీవే నా బండవు. సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను. నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు. సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.


దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా ప్రజలు మరచిపోవచ్చును. నా ప్రభువా, నా సంరక్షకుడా, నీ బలంతో వారిని చెదరగొట్టి, వారిని ఓడించుము.


దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. పర్వతం మీద ఎత్తయిన నా క్షేమస్థానం దేవుడే. మహా సైన్యాలు కూడా నన్ను ఓడించలేవు.


నా కీర్తి, విజయం దేవుని నుండి వస్తాయి. ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం


దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను. మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.


“నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.” అని నేను యెహోవాకు చెబుతాను.


కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు. పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.


యెహోవా నా బలం, నన్ను రక్షించేది ఆయనే ఆయన్ని గూర్చి నేను స్తుతిగీతాలు పాడుకొంటాను. యెహోవా నా దేవుడు, ఆయన్ని నేను స్తుతిస్తాను. నా పూర్వీకుల దేవుడు యెహోవా ఆయన్ని నేను ఘనపరుస్తాను.


యెహోవా పేరులో ఎంతో బలం ఉంది. అది బలమైన ఒక దుర్గంలాంటిది. మంచివాళ్లు ఆ దుర్గం దగ్గరకు పరుగెత్తి వెళ్లి, క్షేమంగా ఉంటారు.


ఆయన నిజాయితీ పరులకు మంచి జ్ఞానం దాచి సమకూర్చి ఇస్తాడు. ఆయన నిజాయితీగా నడుచుకొనేవారికి కవచం లాంటివాడు.


ఇలా జరిగితే, అప్పుడు గాలివాన నుండి దాగుకొనే చోటులా ఉంటాడు ఆ రాజు. అది ఎండిన భూమిలో నీటి కాలువలు ప్రవహించినట్టుగా ఉంటుంది. వేడి ప్రదేశంలో ఒక పెద్ద బండ చాటున చల్లని నీడలా ఉంటుంది అది.


యెహోవా, నీవే నాకు బలం; నీవే నాకు రక్షణ. ఆపదలో తలదాచుకోటానికి నీవే సురక్షితమైన చోటు. ప్రపంచ దేశాలన్నీ నీ శరణు వేడి వస్తాయి. ఆ దేశాల వారంతా ఇలా అంటారు: “మా పితరులు చాలామంది బూటకపు దేవుళ్లను నమ్మారు. వారా పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు. కాని ఆ విగ్రహాలు వారికి ఏ రకంగానూ సహాయపడలేవు.


మరొక చోట “నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!” అంతేకాక ఇలా కూడా అన్నాడు: “నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ