కీర్తన 148:4 - పవిత్ర బైబిల్4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి. ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా ఆయనను స్తుతించండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా ఆయనను స్తుతించండి. အခန်းကိုကြည့်ပါ။ |
రెండవ నెల 17వ రోజున భూమి క్రింద ఉన్న జల ఊటలన్నీ బ్రద్దలై, నేలనుండి నీరు ప్రవహించటం మొదలయింది. అదే రోజున భూమిమీద భారీ వర్షాలు కురవటం ప్రారంభం అయింది. ఆకాశానికి కిటికీలు తీసినట్లుగా ఉంది. 40 పగళ్లు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. సరిగ్గా అదే రోజున నోవహు, అతని భార్య, అతని కుమారులు షేము, హాము, యాఫెతు, వారి భార్యలు ఓడ ఎక్కారు. ఈ సమయంలో నోవహు 600 సంవత్సరాల వయస్సువాడు.
యెహోవా నీవే దేవుడివి!, యెహోవా ఆకాశం, అత్యున్నత పరలోకాలు, వాటిలోవున్న సమస్తాన్ని నీవే సృజించావు! భూమినీ, దానిపైనున్న సమస్తాన్నీ నీవే సృజించావు! సముద్రాలను సృజించింది నీవే. వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించింది నీవే! ప్రతిదానికీ ప్రాణంపోసింది నీవే, దేవదూతలు నీకు నమస్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు నిన్ను ఆరాధిస్తారు!