Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 140:3 - పవిత్ర బైబిల్

3 వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురువారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 వాళ్ళు పాము నాలుకలాగా తమ నాలుకలు పదును చేసుకుంటారు. వారి పెదాల కింద పాము విషం ఉంచుకుంటారు. సెలా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 140:3
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యెహోవా దేవుడు, “ఏమిటి నీవు చేసింది?” అన్నాడు ఆ స్త్రీతో. ఆ స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది. నన్ను వెర్రిదాన్ని చేస్తే నేను ఆ పండు తినేశాను” అని చెప్పింది.


నా జీవితం ప్రమాదంలో ఉంది. నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు. ఈటెలు, బాణాలవంటి పదునైన పళ్లు, మనుష్యులను తినే ఖడ్గంలా పదునైన నాలుకలుగల సింహాల్లా వారున్నారు.


వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు. వినలేని త్రాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.


వారి బెదరింపులు, అవమానపు మాటలు వినుము. వారు అలాంటి క్రూరమైన సంగతులు చెబుతారు. వాటిని వింటున్నది ఎవరో వారికి అనవసరం.


ఒక వ్యక్తి ఆలోచన లేకుండా మాట్లాడితే, అప్పుడు ఆ మాటలు ఖడ్గంలా బాధించవచ్చు. అయితే జ్ఞానముగలవాడు అతడు చెప్పే విషయాల గూర్చి జాగ్రత్తగా ఉంటాడు. అతని మాటలు ఆ బాధను నయం చేయవచ్చును.


కాని అంతలో అది ఒక సర్పంలా కాటువేస్తుంది.


ఆ మనిషి దుర్మార్గుడు. ఎంతసేపూ అతడు దుర్మార్గపు పథకాలే వేస్తాడు. అన్నిచోట్లా అతడు చిక్కులు పెడుతుంటాడు.


మనం పాపంచేసి, యెహోవాకు విరోధంగా తిరిగాం. మనం యెహోవా నుండి తిరిగిపోయి, ఆయన్ని విడిచిపెట్టేశాం. చెడు విషయాలను మనం ఆలోచించాం. దేవునికి వ్యతిరేకమైన వాటినే మనం ఆలోచించాం. వీటిని గూర్చి మనం ఆలోచించి, మన హృదయాల్లో వాటి పథకాలు వేసుకొన్నాం.


“వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు. వాటినుండి బాణాల్లా అబద్ధాలు దూసుకు వస్తున్నాయి. సత్యం కాదు కేవలం అసత్యం దేశంలో ప్రబలిపోయింది. వారు ఒక పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు. వారు నన్నెరుగకున్నారు.” ఈ విషయాలు యెహోవా చెప్పియున్నాడు.


ప్రతివాడూ తన పొరుగువానితో అబద్ధములు చెప్పును. ఎవ్వడూ సత్యం పలుకడు. యూదా ప్రజలు అబద్ధమాడుటలో తమ నాలుకలకు తగిన శిక్షణ ఇచ్చారు. వారి పాపం ఆకాశమంత ఎత్తుకు చేరింది!


నా శత్రువుల మాటలు, ఆలోచనలు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి.


మీరు పాముల్లాంటి వాళ్ళు. దుష్టులు మంచి మాటలేవిధంగా ఆడగలుగుతారు. హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది.


సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్ధాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ