Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 128:1 - పవిత్ర బైబిల్

1 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు. ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 యెహోవా అంటే భయభక్తులు కలిగి, ఆయన విధానాల్లో నడుచుకునే వాళ్ళు ధన్యులు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 యెహోవా పట్ల భయం కలిగి, ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 యెహోవా పట్ల భయం కలిగి, ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 128:1
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

అంటే, యెహోవా యొక్క న్యాయ మార్గాన్ని నేననుసరించాను!


నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము. నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.


తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు. అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.


కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు. దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు.


యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.


యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.


పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు. ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.


ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు. వారు యెహోవాకు విధేయులవుతారు.


నేను కష్టంలో ఉన్నాను. సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను. ఆయన నన్ను రక్షించాడు.


కొండల తట్టు నేను చూసాను. కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?


“మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.


దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను. నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.


గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో? ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.


యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు. వారు ఎన్నటికీ కదలరు. వారు శాశ్వతంగా కొనసాగుతారు.


యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!


ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు. పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే కాపలావాళ్లు వారి సమయం వృధా చేసుకొంటున్నట్టే.


యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.


ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,


తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.


ఈ దంపతులు యధార్థంగా, దేవునికి ప్రీతికరంగా నుడుచుకుంటూ ప్రభువు ఆజ్ఞల్ని పాటిస్తూ ఏ అపకీర్తి లేకుండా నిష్టాపరులై జీవించే వాళ్ళు,


ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహం పొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.


“యెహోవా మీ పట్టణాలు మీ పొలాలను ఆశీర్వాదిస్తాడు.


సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే దేవుని మెప్పు పొందటానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. మీరు మేము చెప్పినట్లు జీవిస్తున్నారు. కాని మేము ప్రస్తుతం యేసు ప్రభువు పేరిట మిమ్మల్ని అడిగేదేమిటంటే మీరు ఆ జీవితాన్ని యింకా సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ