Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 11:7 - పవిత్ర బైబిల్

7 అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు. మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. ఆయన నీతిన్యాయాలను ప్రేమిస్తాడు. నిజాయితీపరులు ఆయన ముఖం చూస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 యెహోవా నీతిమంతుడు, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు; యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 యెహోవా నీతిమంతుడు, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు; యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 11:7
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఏది సరైనదో, దాన్ని చేసే ప్రజల విషయం దేవుడు శ్రద్ధ చూపిస్తాడు. మంచి వాళ్లను ఆయన పాలకులుగా ఉండనిస్తాడు. మంచి వాళ్లకు దేవుడు శాశ్వతమైన ఘనత ఇస్తాడు.


గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు. కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు. మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.


న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను. మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.


దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు. నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెడ్తుంది.


యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు, ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.


నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు. యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.


మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. ఆయన వారి ప్రార్థనలు వింటాడు.


యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు. యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు. కాని దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.


నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను? ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది. ఆయన నన్ను కాపాడుతాడు.


నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు. కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా నీ దేవుడు కోరుకొన్నాడు.


నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి. నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.


యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.


దేవుడు మంచి న్యాయమూర్తి, మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు.


చెడ్డవాళ్లను శిక్షించి మంచివాళ్లకు సహాయం చేయుము. దేవా, నీవు మంచివాడవు, మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు.


శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు. దేవా, నీతిని నీవు చేశావు. యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.


దుర్మార్గులు జీవించే విధానం యెహోవాకు అసహ్యం. మంచి పనులను చేయాలని ప్రయత్నించే మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.


ఎందుకు ఇలా జరగుతుంది? ఎందుకంటె, నేను యెహోవాను గనుక, న్యాయం అంటే నాకు ఇష్టం గనుక. దొంగతనం, సమస్త చెడుగు నాకు అసహ్యం. కనుక ప్రజలకు తగిన శిక్ష నేను ఇస్తాను. నా ప్రజలతో శాశ్వతంగా నేను ఒక ఒడంబడిక చేసుకొన్నాను.


నీతిమంతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు. వాళ్ళ ప్రార్థనల్ని శ్రద్ధతోవింటూ ఉంటాడు. కాని దుష్టుల విషయంలో ముఖం త్రిప్పుకుంటాడు.”


ప్రియ మిత్రులారా! మనం ప్రస్తుతానికి దేవుని సంతానం. ఇకముందు ఏ విధంగా ఉంటామో దేవుడు మనకింకా తెలియబరచలేదు. కాని యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనెలా ఉంటాడో చూస్తాము. కనుక మనం కూడా ఆయనలాగే ఉంటామని మనకు తెలుసు.


వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసళ్ళపై ఉంటుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ