Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 103:4 - పవిత్ర బైబిల్

4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు. ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 నరకంలో నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తారు నీ తలపై ప్రేమ వాత్సల్య కిరీటం ధరింపచేస్తారు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 నరకంలో నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తారు నీ తలపై ప్రేమ వాత్సల్య కిరీటం ధరింపచేస్తారు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 103:4
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయనే నా కష్టాలన్నింటినుండి నన్ను రక్షించిన దూత. ఆయనే ఈ బాలురను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లలకు నా పేరు ఉంటుంది. మన పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకుల పేర్లు వారికి ఉంటాయి. వారు ఈ భూమి మీద గొప్ప వంశాలుగా గొప్ప రాజ్యాలుగా ఎదగాలని నా ప్రార్థన.”


పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.


యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచివాటిని రాజుకిచ్చావు. బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు.


యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు. తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.


యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.


ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు. నేను ఓడిపోకుండా నీవు కాపాడావు. కనుక బ్రతికి ఉన్న మనుష్యులు మాత్రమే చూడగల వెలుగులో నేను దేవుని ఆరాధిస్తాను.


కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు. బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.


నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది. నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను.


అయితే మానవుడు నీకు ముఖ్యం. వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు. మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.


చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి. ఇప్పుడు నాకు శాంతి ఉంది. నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు. నీవు నా పాపాలన్నీ క్షమించావు. నీవు నా పాపాలను దూరంగా పారవేశావు.


నేను చాలా కోపగించి కొద్ది కాలం పాటు నీ నుండి దాక్కున్నాను. కానీ శాశ్వతంగా నిన్ను నేను దయతో ఆదరిస్తాను.” నీ రక్షకుడైన యెహోవా ఇది చెప్పాడు.


పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు. ఆ విధంగా పరీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పొందుతాడు. అంటే దేవుడు తనను ప్రేమించినవాళ్ళకు చేసిన వాగ్దానం అతడు పొందుతాడన్నమాట.


ముఖ్య కాపరి ప్రత్యక్షం అయినప్పుడు ఎన్నిటికీ నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది.


వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడారు: “నీవు వధింపబడినందుకు ప్రతి జాతినుండి ప్రతి భాషనుండి, ప్రతి దేశంనుండి, ప్రతి గుంపునుండి, నీ రక్తంతో మానవుల్ని దేవుని కోసం కొన్నావు. కనుక ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పే అర్హత నీవు పొందావు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ