“ఇదిలా వుండగా ఒక యాత్రికుడు ధనవంతుని చూడటానికి ఆ నగరంలో ఆగాడు. ధనికుడు ఆ యాత్రికునికి ఆహారం ఇవ్వపోయాడు. కాని ఆ యాత్రికునికి ఆహారంగా తనకున్న గొర్రెలలో గాని, పశువులలో గాని దేనినీ చంపటానికి ధనికుడు ఇష్టపడలేదు. దానికి బదులు, ధనికుడు ఆ నగరంలో ఉన్న పేదవాని గొర్రెపిల్లను తీసుకొని, చంపి ఆ యాత్రికునికి ఆహారంగా వండించాడు.”
నీ స్వంత బావి నుండి ప్రవహించు నీళ్లు మాత్రమే త్రాగు. మరియు నీ నీళ్లను బయట వీధుల్లోకి ప్రవహించ నీయకు. (నీ స్వంత భార్యకు ఒక్కదానికి మాత్రమే, నిన్ను నీవు అప్పగించుకో. నీవు నీ ప్రత్యేక ప్రేమను ఇవ్వాల్సింది ఆమెకు మాత్రమే. నీ కుటుంబానికి వెలుపల పిల్లలకు నీవు తండ్రివి కావద్దు).
నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు లేదా లేడి పిల్లలా ఉన్నాడు. మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు, కిటికీలోనుంచి తేరి పార చూస్తూ, అల్లిక కిటికీలోనుంచి చూస్తూ