Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 27:10 - పవిత్ర బైబిల్

10 నీ స్నేహితులను, నీ తండ్రి స్నేహితులను మరువకు. మరియు నీకు కష్టం వస్తే సహాయం కోసం చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లవద్దు. చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లడం కంటే నీ దగ్గరలో ఉన్న నీ పొరుగువారిని అడగటం మంచిది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచి పెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 నీ స్నేహితుడినైనా నీ తండ్రి స్నేహితుడినైనా విడిచి పెట్టవద్దు. నీ ఆపద దినాన నీ అన్నదమ్ముల ఇళ్ళకు వెళ్లకు. దూరంగా ఉన్న సోదరుడి కంటే దగ్గరున్న పొరుగువాడే మంచిది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 నీ స్నేహితులను గాని నీ కుటుంబ స్నేహితులను గాని విడచిపెట్టకు, నీకు ఆపద కలిగిన రోజున నీ సహోదరుల ఇంటికి వెళ్లకు, దూరంలో ఉన్న సహోదరుల కంటే దగ్గర ఉన్న పొరుగువాడు మేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 నీ స్నేహితులను గాని నీ కుటుంబ స్నేహితులను గాని విడచిపెట్టకు, నీకు ఆపద కలిగిన రోజున నీ సహోదరుల ఇంటికి వెళ్లకు, దూరంలో ఉన్న సహోదరుల కంటే దగ్గర ఉన్న పొరుగువాడు మేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 27:10
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

సౌలు మనుమడైన మెఫీబోషెతు దావీదు రాజును కలియటానికి వచ్చాడు. రాజు యెరూషలేము వదిలి వెళ్లిన నాటినుండి ప్రశాంతంగా తిరిగి వచ్చేవరకు మెఫీబోషెతు కాళ్లు కడగలేదు; గడ్డం తీసుకోలేదు; తన బట్టలు కూడ ఉతుకుకొనలేదు.


నా తాత యొక్క కుటుంబాన్నంతటినీ నీవు చంపగలిగియుండే వాడివి. కాని నీవు అలా చేయలేదు. నీ బల్ల వద్ద భోజనం చేసే వారితో కలిసి తినే అర్హత నాకు కలిగించావు. కావున దేనిని గురించీ రాజుకు ఫిర్యాదు చేసే హక్కు నాకు లేదు!”


కాని రాజు యోనాతాను కుమారుడైన మెఫిబోషెతుకు రక్షణ కల్పించాడు. (యోనాతాను సౌలు కుమారుడు) ఆ మేరకు దావీదు యెహోవా పేరు మీద యోనాతానుకు ప్రమాణం చేసియున్నాడు. అందువల్ల రాజు వారిని మెఫీబోషెతుకు హాని చేయించలేదు.


రాజైన యోవాషు యెహోయాదా తన పట్ల చూపిన కనికరాన్ని గుర్తు పెట్టుకోలేదు. యెహోయాదా జెకర్యా తండ్రి. కాని యెహోయాదా కుమరుడైన జెకర్యాను యోవాషు చంపివేశాడు. తను చనిపోయేముందు జెకర్యా, “నీ వేమీ చేస్తున్నావో యెహోవా చూచి, నిన్ను శిక్షించుగాక!” అని అన్నాడు.


స్నేహితుడు అన్ని వేళలా ప్రేమిస్తాడు. నిజమైన సోదరుడు ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా నిన్ను బలపరుస్తాడు.


ఒక మనిషికి స్నేహితులు చాలా మంది ఉంటే అది అతనిని పాడు చేయవచ్చును. కాని ఒక సోదరుని కంటే ఒక మంచి స్నేహితుడు మేలు.


ఒక మనిషి పేదవాడైతే, అతని కుటుంబం కూడా అతనికి విరోధంగా ఉంటుంది. అతని స్నేహితులంతా అతని దగ్గరనుండి వెళ్లిపోతారు. ఆ పేదవాడు సహాయం కోసం వారిని భిక్షం అడగవచ్చు. కాని వారు అతని దగ్గరకు కూడా వెళ్లరు.


యెహోవా ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా? అందుకేనా వారు నాపట్ల విముఖులైనారు? మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు. తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు.


మరుసటి రోజు యూదులు ఒక కుట్ర పన్నారు. పౌలును చంపేవరకు అన్నపానాలు ముట్టరాదని వాళ్ళందరూ ఒక ప్రమాణం తీసుకున్నారు.


“నీ పొరుగు వాని ఆవు లేక గొర్రె తప్పి పోయి తిరగటం నీవు చూసినప్పుడు చూడనట్టు విస్మరించకూడదు. నీవు దాన్ని తప్పక దాని యజమాని దగ్గరకు తీసుకొని వెళ్లాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ