Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 19:2 - పవిత్ర బైబిల్

2 దేనిగూర్చిగాని ఉద్వేగం పడిపోవటం మాత్రం చాలదు. నీవు చేస్తోంది ఏమిటో కూడా నీకు తెలిసి ఉండాలి. నీవు తొందరపడి ఏదీ చేయకూడదు. లేకపోతే నీవు తప్పు చేస్తావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఒకడు తెలివిలేకుండుట మంచిది కాదు తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఆలోచన లేకుండా కోరికలుండడం మంచిది కాదు. తొందరపడి పరిగెత్తేవాడు దారి తప్పిపోతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 ఒక వ్యక్తి తెలివిలేనివాడుగా ఉండడం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 ఒక వ్యక్తి తెలివిలేనివాడుగా ఉండడం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 19:2
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఒక వ్యక్తి మూలికలు తీసుకు వచ్చేందుకు పొలం వెళ్లాడు. అతను పిచ్చి ద్రాక్ష చూసి దాని కాయలు తీసుకు వచ్చాడు. ఆ కాయలు తన ఒడిలో కట్టుకుని తీసుకుని వచ్చాడు. అతను ఆ కాయలను ముక్కలు చేసి కుండలో వేశాడు. కాని అది ఏరకపు ఫలమో ప్రవక్తల బృందానికి తెలియదు.


“నేను అబద్ధాల జీవితం జీవించి ఉంటే, లేక ప్రజలకు అబద్దాలు చెప్పి, మోసం చేసేందుకు నేను పరుగులెత్తి ఉంటే.


ఆ చెడ్డ మనుష్యులు కీడు చేయటానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. వారు ఎంతసేపూ మనుష్యులను చంపాలని ఆశిస్తూంటారు.


ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి. కాని బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తుంది.


సహనంగల మనిషి చాలా తెలివిగలవాడు. త్వరగా కోపపడు మనిషి బుద్ధిహీనుడని కనపరచుకుంటాడు.


జాగ్రత్తగల ఏర్పాటులు లాభం తెచ్చిపెడ్తాయి. కాని నీవు జాగ్రత్త లేకుండా, మరీ తొందరపడి పనులు చేస్తే, నీవు దరిద్రుడివి అవుతావు.


నీవు చూచిన దానిని గూర్చి న్యాయమూర్తికి చెప్పుటకు త్వరపడవద్దు. నీవు చెప్పింది తప్పు అని మరో వ్యక్తి గనుక చెబితే అప్పుడు నీవు ఇబ్బంది పడాల్సి వస్తుంది.


దేవుణ్ణి వెంబడించే మనిషిని ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే కేవలం ధనికుడు కావాలని మాత్రమే ప్రయత్నించే మనిషి శిక్షించబడతాడు.


ఒక స్వార్థపరుడు ధనికుడు కావాలని మాత్రమే కోరుకుంటాడు. ఆ మనిషి దరిద్రుడు అయ్యేందుకు చాలా దగ్గరలో ఉన్నాడని అతడు గ్రహించడు.


ఒక మనిషి ఆలోచన లేకుండా మాట్లాడితే వానికి ఆశ లేదు. ఆలోచన లేకుండా మాట్లాడే ఒక మనిషికంటే ఒక బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ ఉంది.


ప్రసంగి గొప్ప జ్ఞాని. అతడు తన జ్ఞానాన్ని జనానికి బోధ చేసేందుకు వినియోగించాడు. అనేక వివేకవంతమైన బోధనలను అతడు ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేసి, జాగ్రత్తగా విభజించాడు.


తొందరపడి కోపం తెచ్చుకోకు ఎందుకంటే అది అవివేకం (మూర్ఖులు అవి చేస్తారు)


ద్రాక్షవల్లులు ఎండిపోతాయి. రెమ్మలు విరిగి పోతాయి. ఆ రెమ్మలను ఆడవాళ్లు పొయ్యిలో కట్టెలుగా ఉపయోగిస్తారు. ప్రజలు అర్థం చేసుకొనేందుకు నిరాకరిస్తారు. కనుక దేవుడు వారి సృష్టికర్త, వారిని ఆదరించడు. వారి సృష్టికర్త వారి మీద దయ చూపించడు.


ఆ విషయాల మూలంగా, నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు: “సీయోనులో నేల మీద నేను ఒక బండను, ఒక మూలరాయిని ఉంచుతాను. ఇది చాలా ప్రశస్తమైన రాయి. ముఖ్యమైన ఈ బండమీదనే సమస్తం నిర్మించబడుతుంది. ఆ బండను విశ్వసించిన వారు నిరాశ చెందరు.


“నా ప్రజలకు తెలివి లేదు గనుక నాశనం చేయబడ్డారు. నేర్చుకొనేందుకు మీరు నిరాకరించారు. కనుక నా కోసం మిమ్మల్ని యాజకులుగా ఉండనిచ్చుటకు నేను నిరాకరిస్తాను. మీరు మీ దేవుని న్యాయచట్టం మరచిపోయారు గనుక నేను మీ పిల్లల్ని మరచిపోతాను.


వాళ్ళకు నా గురించి కాని, తండ్రిని గురించి కాని, తెలియదు కనుక అలా చేస్తారు.


వాళ్ళు శ్రద్ధతో దేవుని సేవ చేస్తున్నారని నేను సాక్ష్యం చెప్పగలను. కాని వాళ్ళ శ్రద్ధ జ్ఞానం మీద ఆధారపడలేదు.


ఇదే నా ప్రార్థన: మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ