Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 17:12 - పవిత్ర బైబిల్

12 ఒక తల్లి ఎలుగుబంటి, దాని పిల్లలు ఎత్తుకొనిపోబడి, కోపంగా ఉన్నప్పుడు దాన్ని కలుసుకోవటం చాలా ప్రమాదకరం. కాని తెలివి తక్కువ పనులు చేయటంలో నిమగ్నం అయిపోయి ఉన్న బుద్ధిహీనుణ్ణి కలుసుకోవటంకంటే అది మేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 మూర్ఖత్వానికి లొంగిన బుద్ధిహీనుని కలవడం కంటే పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలవడం మేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 మూర్ఖత్వానికి లొంగిన బుద్ధిహీనుని కలవడం కంటే పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలవడం మేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 17:12
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ తండ్రి, అతని మనుష్యులు చాలా గట్టివారని నీకు తెలుసు. పొలాల్లో తన పిల్లల్ని పొగొట్టుకున్న ఎలుగు బంటివలె వారు మహా కోపంతో వున్నారు. నీ తండ్రి బహు నేర్పరియైన యోధుడు. అతను రాత్రంతా తన మనుష్యులతో కలిసి వుండడు.


ఎలీషా వెనుదిరిగి ఆ బాలురను చూశాడు. వారి పట్ల చెడు విషయాలు జరగాలని అతను యెహోవాని అర్థించాడు. తర్వాత అడవినుండి రెండు ఎలుగు బంట్లు వెలుపలికి వచ్చి ఆ బాలురను ఎదిరించాయి. ఆ ఎలుగుబంట్లు ఆ నలభై రెండు మంది పిల్లలను చీల్చివేశాయి.


దుర్మార్గుడు తప్పు మాత్రమే చేయాలని కోరుతాడు. అంతంలో అతణ్ణి శిక్షించేందుకు దేవుడు ఒక దూతను పంపిస్తాడు.


మోయుటకు ఒక బండ బరువుగాను యిసుక గట్టిగాను ఉంటాయి. కాని ఒక బుద్ధిహీనుని కోపము మూలంగా కలిగిన కష్టాన్ని మోయటం ఆ రెండింటి కంటే సహించడం కష్టం.


ఒక దుర్మార్గుడు బలహీనుల మీద పరిపాలన చేస్తే అతడు కోపంగా ఉన్న ఒక సింహంలా గాని, పోట్లాడేందుకు సిద్ధంగా ఉన్న ఒక ఎలుగుబంటిలా గాని ఉంటాడు.


జ్ఞానముగల మనిషి తెలివి తక్కువ వానితో ఒక సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తే ఆ తెలివి తక్కువ వాడు వాదం పెట్టుకొని మూర్ఖంగా మాట్లాడుతాడు. ఆ ఇద్దరూ ఎన్నటికీ ఏకీభవించరు.


తన కూనల్ని కోల్పోయిన ఎలుగుబంటిలాగ నేను వాళ్లపైన దాడిచేస్తాను. నేను వాళ్ల రొమ్ములు చీలుస్తాను. తన కెదురైన జంతువును చీల్చి తినేసే ఒక క్రూర మృగంలాగ ఉంటాను”


జ్ఞానులు తనను మోసం చేసారని గ్రహించి హేరోదు కోపంతో మండిపొయ్యాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బేత్లేహేములో, దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, లేక అంతకన్నా తక్కువ వయస్సుగల బాలురనందర్ని చంపివేయమని ఆజ్ఞాపించాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ