Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 12:1 - పవిత్ర బైబిల్

1 ఒక మనిషి జ్ఞానము కలిగి ఉండాలి అనుకొంటే, అతడు తప్పు చేసినప్పుడు దానిని ఎవరైనా అతనికి చెప్పగా అతనికి కోపంరాదు. తాను చేసింది తప్పు అని ఎవరైనా తనకు చెప్పటం ఇష్టంలేని మనిషి మూర్ఖుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 జ్ఞానం కోరుకున్నవాడు గద్దింపుకు లోబడతాడు. దిద్దుబాటును తిరస్కరించేవాడు పశువుతో సమానం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు, కానీ దిద్దుబాటును అసహ్యించేవాడు మూర్ఖుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు, కానీ దిద్దుబాటును అసహ్యించేవాడు మూర్ఖుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 12:1
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము. నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము.


ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు. అది నాకు మంచిదే. వారి విమర్శను నేను అంగీకరిస్తాను. నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.


కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము. ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి. నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”


కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు. నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.


నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు. మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.


జ్ఞానముగల మనిషితో ఎవరైనా ఏదైనా చేయమని చెబితే అతడు విధేయుడవుతాడు. కాని బుద్ధిహీనుడు వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు.


మంచి మనుష్యులకు భూమి మీద ప్రతిఫలం ఇవ్వబడితే, నిశ్చయంగా దుర్మార్గులు, పాపులు వారికి తగిన దానిని పొందుతారు.


మంచి మనిషి విషయం యెహోవా సంతోషిస్తాడు. కాని దుర్మార్గుణ్ణి దోషిగా యెహోవా తీర్పుర్చు చెబుతాడు.


ఒక వ్యక్తి అక్రమంగా జీవించటం మొదలు పెడితే అతడు శిక్షించబడుతాడు. సరిదిద్దబడటానికి ఇష్టపడని మనిషి నాశనం చేయబడతాడు.


ఇతరులు అంటే గిట్టనివాడు తాను చేసే వాటిలో స్వార్థపరుడుగా ఉంటాడు. ప్రజలు మంచి సలహాను ఇచ్చినప్పుడు అతడు కోపగించుకుంటాడు.


భూమి మీద నేను అతి దౌర్భాగ్యుడను. నేను గ్రహించాల్సిన విధంగా గ్రహించటంలేదు.


నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను. నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు.


“పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి. మీరు నా మార్గాలు వెంబడిస్తే మీరు కూడా సంతోషంగా ఉండగలరు


అయితే నాకు విరోధముగా పాపముచేయు వ్యక్తి తనకు తానే హాని చేసుకొంటాడు. నన్ను అసహ్యించుకొనువారు మరణమును ప్రేమించెదరు.”


ఎద్దుకు తన కామందు తెలుసు. గాడిదకు దాని సొంతదారుడు మేత పెట్టే చోటు తెలుసు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు నేను తెలియదు. నా ప్రజలు గ్రహించరు.”


యాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. చర్మంలో తెల్లని వాపుఉండి, వెంట్రుకలు తెల్లబడి ఉండి, వాపులో చర్మంతెల్లగా కనబడితే


నాశనం కానున్నవాళ్ళను అన్ని విధాలా మోసం చేస్తాడు. వాళ్ళు సత్యాన్ని ప్రేమించటానికి, దేవుని రక్షణను స్వీకరించటానికి నిరాకరించారు కనుక నశించిపోతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ