సంఖ్యా 6:10 - పవిత్ర బైబిల్10 ఎనిమిదో రోజున అతడు రెండు గువ్వలను, రెండు పావురపు పిల్లలను యాజకుని దగ్గరకు తీసుకుని రావాలి. పవిత్ర గుడార ద్వారం దగ్గరే అతడు వాటిని యాజకునికి ఇవ్వాలి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఎనిమిదవదినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న యాజకునియొద్దకు తేవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఎనిమిదో రోజున అతడు రెండు గువ్వలను గానీ లేదా రెండు పావురం పిల్లలను గానీ పట్టుకుని వాటిని సన్నిధి గుడారం ద్వారం దగ్గర ఉన్న యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 తర్వాత ఎనిమిదవ రోజు రెండు తెల్ల గువ్వలను, రెండు పావురపు పిల్లలను సమావేశ గుడారం ద్వారం దగ్గర యాజకుడి దగ్గరకు తేవాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 తర్వాత ఎనిమిదవ రోజు రెండు తెల్ల గువ్వలను, రెండు పావురపు పిల్లలను సమావేశ గుడారం ద్వారం దగ్గర యాజకుడి దగ్గరకు తేవాలి. အခန်းကိုကြည့်ပါ။ |
“ప్రసవించిన తల్లి పవిత్రం అయ్యేందుకు ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. పవిత్రపర్చబడే ఆ ప్రత్యేక సమయం అయిపోగానే ఆడపిల్ల తల్లియైనా, మగపిల్ల తల్లియైనా, ఆ తల్లి ప్రత్యేకమైన బలి అర్పణలను సన్నిధి గుడారానికి తీసుకొనిరావాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ బలి అర్పణలను ఒక యాజకునికి ఇవ్వాలి. దహన బలికోసం ఒక సంవత్సరం వయస్సుగల ఒక గొర్రెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురం పిల్లను లేక ఒక గువ్వను ఆమె తీసుకొనిరావాలి.