Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 5:28 - పవిత్ర బైబిల్

28 కానీ ఆస్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, ఆమె పవిత్రంగా ఉంటే అప్పుడు ఆమె నిర్దోషి అని యాజకుడు చెబుతాడు. అప్పుడు ఆమె మామూలుగా ఉండి పిల్లలను కనగల్గుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రురాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగునని చెప్పుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 ఒకవేళ ఆ స్త్రీ అపవిత్రం కాకుండా పవిత్రంగా ఉంటే విడుదల పొందుతుంది. ఆమె సంతానం పొందడానికి యోగ్యురాలవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 అయితే ఆమె తనను తాను అపవిత్రం చేసుకోకుండ పవిత్రంగా ఉంటే, తాను నిర్దోషిగా ఉండి పిల్లలను కనగలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 అయితే ఆమె తనను తాను అపవిత్రం చేసుకోకుండ పవిత్రంగా ఉంటే, తాను నిర్దోషిగా ఉండి పిల్లలను కనగలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 5:28
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును. కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు. యెహోవాను స్తుతించండి!


“అప్పుడు అబద్ధం చెప్పకూడదని యాజకుడు ఆ స్త్రీతో చెబుతాడు. సత్యం చెబుతానని ఆమె వాగ్ధానం చేయాలి. యాజకుడు ఆమెతో ఇలా అంటాడు, ‘నీవు ఇంకో మగవాడితో శయనించి ఉండకపోతే, నీ భర్తను పెళ్లాడిన నీవు, అతనికి వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, కష్టం కలిగించే ఆ జలం నీకు హాని చేయదు.


ఆ స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం గనుక చేసి ఉంటే, ఆ నీళ్లు ఆమెకు హాని కలిగిస్తాయి. ఆ నీళ్లు ఆమె శరీరంలోనికి పోయి, ఆమెకు చాలా శ్రమ కలిగిస్తాయి. ఆమెలో ఏదైనా శిశువు ఉంటే అది పుట్టక ముందే మరణిస్తుంది, ఆమె ఎన్నటికీ పిల్లలను కనదు. ప్రజలంతా ఆమెకు వ్యతిరేకం అవుతారు.


“అందుచేత రోషమునుగూర్చిన ఆజ్ఞ ఇది. తన భర్తతో వివాహం జరిగిన ఒక స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నీవు చేయాల్సింది ఇది.


క్షణికమైన మా మామూలు కష్టాలు మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నవి. మనము పొందుతున్న మహిమతో, అనుభవింపనున్న కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కింపతగినవి కావు.


“ఒకడు ఒక స్త్రీని వివాహం చేసుకొన్న తర్వాత ఆమెను గూర్చిన రహస్యం ఏదో తెలిసి ఆమెను ఇష్టపడడు. అతనికి ఆమె ఇష్టం లేకపోతే అతడు విడాకుల పత్రం వ్రాసి, దానిని ఆమెకు ఇవ్వాలి. అప్పుడు అతడు ఆమెను తన ఇంటినుండి పంపించి వేయాలి.


మీ విశ్వాసం యథార్థమైనదని రుజువగుటకు ఈ శ్రమలు మీకొచ్చాయి. బంగారం నిప్పుచేత కాల్చబడి శుద్ధి అయినా, చివరికది నాశనం కాక తప్పదు. మీ విశ్వాసం బంగారం కంటే విలువైనదిగా యుండి యేసు క్రీస్తు వచ్చినప్పుడు ప్రశంస, మహిమ, ఘనత పొంద తగినదిగా వుంటుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ