సంఖ్యా 31:28 - పవిత్ర బైబిల్28 యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర ఆ సామగ్రిలో కొంత భాగం తీసుకో. ఆ భాగం యెహోవాకు చెందుతుంది. ప్రతి 500 వస్తువుల్లో ఒక వస్తువు యెహోవా భాగం. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నింటిలోను ఇలాగే. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 మరియు సేనగా బయలుదేరిన యోధులమీద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱె మేకలలోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగములోనుండి తీసికొని အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 యుద్ధానికి వెళ్ళిన సైనికులపై యెహోవా కోసం పన్ను వేసి, ఆ మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగభాగంలో నుండి తీసుకుని အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 యుద్ధంలో పోరాడిన సైనికుల భాగం నుండి, ప్రతి అయిదువందల నుండి అనగా మనుష్యులైనా, పశువులైనా, గాడిదలైనా లేదా గొర్రెలైనా సరే ఒకరిని, ఒకదాన్ని యెహోవాకు పన్నుగా వేరు చేయాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 యుద్ధంలో పోరాడిన సైనికుల భాగం నుండి, ప్రతి అయిదువందల నుండి అనగా మనుష్యులైనా, పశువులైనా, గాడిదలైనా లేదా గొర్రెలైనా సరే ఒకరిని, ఒకదాన్ని యెహోవాకు పన్నుగా వేరు చేయాలి. အခန်းကိုကြည့်ပါ။ |
ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవాకు ఒక అర్పణ తీసుకొని రాబడుతుంది. ఎత్తుగా బలంగా ఉండే ఆ ప్రజలు దగ్గర్నుండే ఆ కానుక వస్తుంది. (ఎత్తుగా, బలంగా ఉండే ఈ ప్రజలంటే అన్ని చోట్ల మనుష్యులందరికీ భయమే. వారు చాలా బలమైన రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను ఓడిస్తుంది. నదులచే విభజించబడిన దేశంలో వారు ఉన్నారు.) ఈ కానుక, సీయోను కొండలోని యెహోవా స్థానానికి తీసుకొని రాబడుతుంది.
దూర దేశాలు నాకోసం కనిపెడ్తున్నాయి. తర్షీషు మహా ఓడలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. దూర దేశాలనుండి నీ పిల్లలను తీసుకొని వచ్చేందుకు ఆ ఓడలు సిద్ధంగా ఉన్నాయి. మరియు వారి వెండి బంగారాలను ఆ ఓడలు తీసుకొని వస్తాయి. నీ దేవుడు యెహోవాను గౌరవించుటకు ఇది జరుగుతుంది. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు అద్భుత కార్యాలు చేస్తాడు గనుక ఇది జరుగుతుంది.