Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 30:15 - పవిత్ర బైబిల్

15 కానీ భర్త ఆ ప్రమాణాలను గూర్చి విని, వాటిని వారిస్తే, అప్పుడు ఆమె ప్రమాణాలను ఉల్లంఘించినందుకు అతడు బాధ్యుడు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దుచేసినయెడల, తానే ఆమె దోషశిక్షను భరించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అతడు వాటిని గురించి విన్న చాలా కాలం తరువాత వాటిని రద్దుచేస్తే, అతడు ఆమె దోషశిక్షను తానే భరిస్తాడు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 అయితే అతడు వినిన కొద్ది కాలం తర్వాత వాటిని రద్దు చేస్తే అతడు చేసిన తప్పుకు ప్రతిఫలం భరించాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 అయితే అతడు వినిన కొద్ది కాలం తర్వాత వాటిని రద్దు చేస్తే అతడు చేసిన తప్పుకు ప్రతిఫలం భరించాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 30:15
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ఒక వ్యక్తి హెచ్చరికను వినవచ్చు, లేక ఒక వ్యక్తి తాను యితరులతో చెప్పాల్సిన ఒక విషయాన్ని వినటమో, చూడటమో తటస్థిస్తుంది. ఆ వ్యక్తి తాను చూసిన దాన్ని లేక విన్నదాన్ని చెప్పకపోతే అతడు అపరాధి.


కానీ ఆమె భర్త ఆ ప్రమాణం గూర్చి విని, ఆమె ప్రమాణం నిలుపు కొనేందుకు నిరాకరిస్తే, ఆమె తన ప్రమాణం ప్రకారం చేయనక్కర్లేదు. ఆమె ఏమి ప్రమాణం చేసినా సరే ఫర్వాలేదు, ఆమె భర్త ఆ ప్రమాణాన్ని భంగం చేయవచ్చు. ఒకవేళ ఆమె భర్త ఆ ప్రమాణాన్ని భంగం చేస్తే యెహోవా ఆమెను క్షమిస్తాడు.


భర్త ఏ విధంగా తన భార్యను ఆమె ప్రమాణాలను నెరవేర్చనిస్తాడు? అతడు ప్రమాణాలను గూర్చి విని, వాటిని వారించకపోతే, అప్పుడు ఆ స్త్రీ, ఆమె చేసిన ప్రమాణాలను నెరవేర్చాలి.


ఇవి మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. ఒక పురుషుడు, అతని భార్యను గూర్చి, ఒక తండ్రి, ఇంకా చిన్నదిగా ఉండి తన తండ్రి ఇంటనే ఉంటున్న కూతురును గూర్చిన ఆజ్ఞలు ఇవి.


అయితే ఆమె తండ్రి ఆ ప్రమాణం గూర్చి విని, ఒప్పుకొనకపోతే, అప్పుడు ఆ యువతి తన ప్రమాణానికి బాధ్యురాలు కాదు. ఆమె చేసిన ప్రమాణం ప్రకారం ఆమె నెరవేర్చాల్సిన పనిలేదు. ఆమె తండ్రి ఆమెను వారించాడు గనుక యెహోవా ఆమెను క్షమిస్తాడు.


కానీ ఆ ప్రమాణం గూర్చి భర్త విని, ఒప్పుకొనకపోతే, ఆ భార్య తన ప్రమాణం ప్రకారం చేయనవసరం లేదు. ఆమె భర్త ప్రమాణాన్ని భంగం చేసి, ఆమె చెప్పినట్టు ఆమెను చేయనివ్వలేదు. కనుక యెహోవా ఆమెను క్షమిస్తాడు.


ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరు సమానం.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ