Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 3:38 - పవిత్ర బైబిల్

38 సన్నిధి గుడారం ఎదుట పవిత్ర గుడారానికి తూర్పున మోషే, అహరోను, అతని కుమారులు విడిదిచేసారు. పవిత్ర స్థలాన్ని కాపాడే బాధ్యత వారికి ఇవ్వబడింది. ఇది ఇశ్రాయేలీయులందరి పక్షంగా వారు చేసారు. వేరే వారెవరైనా పవిత్ర స్థలం దగ్గరగా వస్తే చంపేయాల్సిందే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

38 మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడ వలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

38 మోషే, అహరోనూ, అతని కొడుకులూ మందిరానికి తూర్పు వైపున సూర్యోదయ దిశగా సన్నిధి గుడారానికి ఎదురుగా తమ గుడారాలు వేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిన పనులకూ, పరిశుద్ధ స్థలంలో నెరవేర్చాల్సిన విధులకూ వారు బాధ్యత వహించాలి. పరాయి వాడు ఎవడైనా పరిశుద్ధ స్థలాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

38 మోషే, అహరోను, అతని కుమారులు సమావేశ గుడారానికి తూర్పున, అనగా సూర్యుడు ఉదయించే వైపున సమావేశ గుడారానికి ఎదురుగా ఉండాలి. ఇశ్రాయేలీయుల పక్షంగా పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత వీరిది. ఇతరులెవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే వారికి మరణశిక్ష.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

38 మోషే, అహరోను, అతని కుమారులు సమావేశ గుడారానికి తూర్పున, అనగా సూర్యుడు ఉదయించే వైపున సమావేశ గుడారానికి ఎదురుగా ఉండాలి. ఇశ్రాయేలీయుల పక్షంగా పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత వీరిది. ఇతరులెవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే వారికి మరణశిక్ష.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 3:38
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

కావున తాము ఏఏ పనులు చేయాలో అవన్నీ లేవీయులు నిర్వహించేవారు. వారు పవిత్ర గుడారం, పవిత్ర స్థలాల విషయంలో కూడ తగిన జాగ్రత్తలు తీసుకొనేవారు. ఆ విధంగా వారి బంధువులగు అహరోను వంశీయులకు వారు సహాయపడ్డారు. అహరోను సంతతివారెవరనగా యాజకులు, ప్రధాన యాజకులు. ఆలయంలో యెహోవా సేవలో ఈ యాజకులకు లేవీయులు సహాయపడ్డారు.


పవిత్ర గుడారం ఎప్పుడైనా ముందుకు తీసుకుని పోదలిస్తే లేవీ మనుష్యులే అది చేయాలి. ఎప్పుడైనా సరే ఒకచోట పవిత్రగుడారం వేయబడితే, అది లేవీ మనుష్యులే వేయాలి. పవిత్ర గుడారం విషయం జాగ్రత్త తీసుకునేవారు వాళ్లే. లేవీ కుటుంబానికి చెందనివారు ఇంకెవరయినా గుడారాన్ని గూర్చి శ్రద్ధ తీసుకునేందుకు ప్రయత్నిస్తే, అతడు చంపివేయబడతాడు.


అయితే లేవీ ప్రజలు పవిత్ర గుడారం చుట్టూ డేరాలు వేయాలి. ఒడంబడిక పవిత్ర గుడారాన్ని లేవీ ప్రజలు కాపాడుతారు. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి కీడూ జరుగకుండా వారు పవిత్ర గుడారాన్ని కాపాడుతారు.”


“యూదా డేరా పతాకం తూర్పుపక్క అంటే సూర్యోదయ దిశన ఉంటుంది. యూదా ప్రజలకు అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను నాయకుడు.


“అహరోనును, అతని కుమారులను యాజకులుగా నీవు నియమించు. వారు, వారి బాధ్యతను నిర్వహిస్తూ యాజకులుగా సేవ చేయాలి, పవిత్ర వస్తువులను సమీపించేందుకు ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా చంపివేయబడాలి.”


గెర్షోని కుటుంబాలు పశ్చిమాన నివాసం చేయాలని చెప్పబడింది. పవిత్ర గుడారం వెనుకవైపు వారు నివాసము చేసారు.


పవిత్ర గుడారం దక్షిణ దిశ కహాతీ వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం.


అబీహాయిలు కుమారుడైన సూరీయేలు మెరారి వంశానికి నాయకుడు. పవిత్ర గుడారం ఉత్తర ప్రదేశం ఈ వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం.


పవిత్ర గుడారం చుట్టు ప్రక్కల స్తంభాలన్నింటినీ వారు కాపాడారు. వాటి దిమ్మలు, మేకులు, తాళ్లు కూడ ఇందులో ఉన్నాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ