సంఖ్యా 28:9 - పవిత్ర బైబిల్9 “విశ్రాంతి దినం శనివారం నాడు, ఒక సంవత్సరం వయసుగల లోపంలేని రెండు గొర్రె పిల్లల్ని, తూమెడు పిండిలో రెండు పదోవంతుల మంచి పిండి ఒలీవ నూనెలో కలిపిన పానార్పణం మీరు అర్పించాలి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱెపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 విశ్రాంతి రోజున ఒక సంవత్సరం వయస్సు ఉండి, ఏ దోషం లేని రెండు గొర్రెపిల్లలను నైవేద్యంగాను, దానితో పాటు పానార్పణ, నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో రెండు పదోవంతులు అర్పించాలి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “ ‘సబ్బాతు దినాన, లోపం లేని ఒక ఏడాది వయస్సు ఉన్న రెండు గొర్రెపిల్లలను, వాటితో పాటు పానార్పణం, భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి అర్పించాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “ ‘సబ్బాతు దినాన, లోపం లేని ఒక ఏడాది వయస్సు ఉన్న రెండు గొర్రెపిల్లలను, వాటితో పాటు పానార్పణం, భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి అర్పించాలి. အခန်းကိုကြည့်ပါ။ |
నా దేవుడైన యెహోవా గౌరవార్థం నేనొక ఆలయం నిర్మింపదలిచాను. నా ప్రజలు ఆరాధించుకొనటానికి వీలుగా దానిని నా దేవునికి అంకితం చేస్తాను. యెహోవా ముందు ధూపం వేసి, ఆయన సన్నిధిని ప్రతినిత్యం పవిత్రమైన రొట్టెను నైవేద్యంగా వుంచి, బలిపీఠంపై ఉదయం, సాయంత్రం దహనబలులు అర్పిస్తూ, మేము మా దేవుని ఆరాధిస్తాము. సబ్బాతు దినాలలోను, అమావాస్య రోజులందును, మరి ఇతర ప్రత్యేక ఉత్సవ దినాలలోను, తనను ఆరాధించుమని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞ యిచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతంగా పాటించే ఒక నియమం.
సబ్బాతు విషయంలో దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నీవు పాపం చేయటం మానివేసినప్పుడు అది జరుగుతుంది. మరియు ఆ ప్రత్యేక రోజున నీ సంతోషం కోసం నీవు పనులు చేయటం మాని వేసినప్పుడు ఆది జరుగుతుంది. సబ్బాతు సంతోష దినంగా నీవు ఎంచుకోవాలి. యెహోవా ప్రత్యేక రోజును నీవు గౌరవించాలి. మిగిలిన ప్రతిరోజూ నీవు చెప్పేవి, చేసేవి మానివేయటం ద్వారా నీవు ఆ ప్రత్యేక రోజును గౌరవించాలి.