సంఖ్యా 24:6 - పవిత్ర బైబిల్6 భూమి మీద మీ గుడారాలు లోయల్లా పరచుకొన్నాయి. అవి నదీ తీరంలో తోటలా ఉన్నాయి. యెహోవా నాటిన అది చక్కటి సువాసనగల మొక్కలా ఉంది. అది నీళ్ల దగ్గర పెరిగే అందమైన చెట్లలా ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 వాగులవలె అవి వ్యాపించియున్నవి నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అవి లోయలు వ్యాపించినట్టు, నదీతీరంలో తోటల్లా, యెహోవా నాటిన అగరు చెట్లలా నీళ్ళ దగ్గరున్న దేవదారు వృక్షాల్లా ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 “అవి లోయల్లా వ్యాపించాయి, నది ప్రక్కన తోటల్లా ఉన్నాయి, యెహోవా నాటిన అగరు వంటివి, జలాల ప్రక్కన దేవదారు చెట్లలా ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 “అవి లోయల్లా వ్యాపించాయి, నది ప్రక్కన తోటల్లా ఉన్నాయి, యెహోవా నాటిన అగరు వంటివి, జలాల ప్రక్కన దేవదారు చెట్లలా ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။ |
ఇశ్రాయేలు ప్రజలు సీయోను కొండ పైకి వస్తారు. వారు ఆనందంతో కేకలు వేస్తారు. యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల కారణంగా వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. యెహోవా వారికి ఆహార ధాన్యాలను, క్రొత్త ద్రాక్షారసాన్ని, నూనెను, గొర్రె పిల్లలను, ఆవులను ఇస్తాడు. నీరు పుష్కలంగా లభించే ఒక తోటలా వారు విలసిల్లుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట ఎంత మాత్రము ఇబ్బంది పెట్టబడరు.
అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు నదికి ఇరు ప్రక్కల పెరుగుతాయి. వాటి ఆకులు ఎన్నడూ ఎండవు. ఆ చెట్లు పండ్లు ఇవ్వకుండా ఎప్పుడూ ఉండవు. ప్రతినెలా అవి పండ్లు ఇస్తూనే ఉంటాయి. చెట్లకు కావలసిన నీరు ఆలయం నుండి వస్తూ ఉంటుంది గనుక ఇలా జరుగుతుంది. చెట్ల నుండి లభించే పండ్లు ఆహారం నిమిత్తమూ, ఆకులు ఔషధాలకూ వినియోగపడతాయి.”