Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 24:18 - పవిత్ర బైబిల్

18 ఇశ్రాయేలీయులు బలము గలవారవుతారు. అతనికి ఏదోము దేశము, అతని శత్రువైన శేయీరు దొరుకుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులువారు స్వాధీనపరచబడుదురు ఇశ్రాయేలు పరాక్రమమొందును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 ఎదోము, శేయీరు, ఇశ్రాయేలు శత్రువులు స్వాధీనం అవుతారు. వారిని ఇశ్రాయేలీయులు తమ బలం చేత జయిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 ఎదోము జయించబడుతుంది; అతని శత్రువైన శేయీరు జయించబడుతుంది. కానీ ఇశ్రాయేలు బలంగా ఎదుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 ఎదోము జయించబడుతుంది; అతని శత్రువైన శేయీరు జయించబడుతుంది. కానీ ఇశ్రాయేలు బలంగా ఎదుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 24:18
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక, జనములు నీకు సాగిలపడుదురు గాక, నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు, “నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడతాడు, నిన్ను ఆశీర్వదించే ప్రతీ వ్యక్తి ఆశీర్వదించబడతాడు.”


నీ మనుగడ కోసం నీవు పోరాడాలి, నీవు నీ సోదరునికి బానిసవు అవుతావు. అయితే స్వతంత్రం కోసం నీవు పోరాడతావు. అతని స్వాధీనం నుండి నీవు విడిపోతావు.”


యాకోబు అన్న ఏశావు శేయీరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇది ఎదోం పర్వత ప్రాంతం. యాకోబు ఏశావు దగ్గరకు వార్తాహరులను పంపాడు.


ఎదోములో దావీదు సైన్యాన్ని రక్షణకై నిలిపాడు. ఎదోము రాజ్యమంతటా కాపలా దళాలను నియమించాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహో వా అతనికి విజయాన్ని సమకూర్చి పెట్టాడు.


ఆ సమయంలో ఎదోమీయుడగు హదదు అను వానిని యెహోవా సొలొమోనుకు శత్రువయ్యేలా చేశాడు. అతడు ఎదోము వంశానికి చెందిన వారిలో ఒకడు.


అది ఇలా జరిగింది. ఇదివరలో దావీదు ఎదోము రాజ్యాన్ని ఓడించాడు. అప్పుడు దావీదు సైన్యాధిపతిగా యోవాబు వున్నాడు. చనిపోయిన వారిని పాతి పెట్టించేందుకు యోవాబు ఎదోములోకి వెళ్లాడు. కాని అతడు అక్కడవున్న మగవారినందరినీ చంపేశాడు.


దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు. నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు. దయచేసి మమ్ములను ఉద్ధరించుము.


“ఆకాశంలో నా ఖడ్గం రక్తసిక్తమైనప్పుడు ఇది జరుగుతుంది” అని యెహోవా చెబుతున్నాడు. చూడండి! యెహోవా ఖడ్గం ఎదోముగుండా దూసుకొనిపోతుంది. ఆ ప్రజలు దోషులని యెహోవా తీర్పు చెప్పాడు, గనుక వారు చావాల్సిందే.


ఎదోమునుండి వస్తున్న ఇతడు ఎవరు? ఎర్రటి వస్త్రాలు ధరించి బొస్రానుండి అతడు వస్తున్నాడు. అతడు తన వస్త్రాల్లో శోభిల్లుతున్నాడు. అతడు మహా శక్తితో అతిశయంగా నడుస్తున్నాడు. “మిమ్మల్ని రక్షించే శక్తి నాకు ఉంది. నేను నిజాయితీగా మాట్లాడుచున్నాను” అని అతడు చెబుతున్నాడు.


“దావీదు గుడారం పడిపోయింది. కాని నేను దానిని తిరిగి నిలబెడతాను. గోడల కంతలు పూడ్చుతాను. శిథిలమైన భవనాలను తిరిగి నిర్మిస్తాను. దానిని పూర్వమున్నట్లు నిర్మిస్తాను.


అప్పుడు ఎదోములో బతికివున్న ప్రజలు, మరియు నా పేరుమీద పిలువబడే జనులందరూ సహాయం కొరకు యెహోవావైపు చూస్తారు.” యెహోవా ఈ మాటలు చెప్పాడు. అవి జరిగేలా ఆయన చేస్తాడు.


“చూడు, సాటి దేశాలలో నిన్ను అల్పునిగా చేస్తాను. ప్రజలు నిన్ను మిక్కిలి అసహ్యించుకుంటారు.


అయితే ఎదోము రాజు, “మీరు మా దేశంలోనుండి ప్రయాణం చేయగూడదు. మా దేశంలోనుండి ప్రయాణం చేయటానికి మీరు ప్రయత్నిస్తే, మేము వచ్చి కత్తులతో మీతో పోరాడుతాము” అని జవాబిచ్చాడు.


“యాకోబు వంశంనుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు. పట్టణంలో ఇంకా బ్రతికి ఉన్న వాళ్లను ఆ పాలకుడు నాశనం చేస్తాడు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ