Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 22:1 - పవిత్ర బైబిల్

1 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాలకు ప్రయాణం చేసారు. యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర వారు నివాసాలు కట్టుకొనిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరంలో ఉన్న మోయాబు మైదానాల్లో శిబిరం వేసుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 తర్వాత ఇశ్రాయేలీయులు మోయాబు సమతల మైదానాల వైపు ప్రయాణం చేసి యొర్దాను నది తూర్పుగా, యెరికో వైపు దిగారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 తర్వాత ఇశ్రాయేలీయులు మోయాబు సమతల మైదానాల వైపు ప్రయాణం చేసి యొర్దాను నది తూర్పుగా, యెరికో వైపు దిగారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 22:1
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

మోయాబు, అమ్మోను, ఎదోము, ఇంకను ఇతర దేశాలలో వున్న యూదా ప్రజలంతా బబులోను రాజు యూదా రాజ్యంలో కొంతమందిని వదిలి వెళ్లినట్లువిన్నారు. షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యాను బబులోను రాజు వారిపై పాలకునిగా నియమించినట్లు కూడ విన్నారు.


బామోతునుండి మోయాబు లోయకు ప్రజలు ప్రయాణం చేసారు. ఇక్కడ ఎడారికి ఎదురుగా పిస్గా శిఖరం కనబడుతుంది.


ఇప్పటికి మోయాబు మైదానంలోనే ప్రజలు నివాసం చేస్తున్నారు. ఇది యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర ఉంది. కనుక మోషే, యాజకుడైన ఎలియాజరు ప్రజలతో మాట్లాడారు. వారు


మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తీసుకుని వచ్చారు. వారు తీసుకున్న వాటన్నింటిని ఇశ్రాయేలీయుల నివాసం దగ్గరకు వారు తీసుకు వెళ్లారు. మోయాబులోని అరాబోతు కొండల దగ్గర ఇశ్రాయేలీయులు నివాసంచేస్తున్నారు. ఇది యెరికో ఎదుట యొర్దాను నదికి తూర్పున ఉంది.


యొర్దాను నదికి పశ్చిమదిక్కునవున్న ఏ భూమినీ మేము తీసుకోము. యొర్దాను నదికి తూర్పు దిక్కున వున్న భూమే మాకు రావలసిన వారసత్వం.”


ఆ రెండున్నర వంశాల వారు యొర్దాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్లో భూమి తీసుకున్నారు.”


యెహోవా మోషేతో ఇలా మాట్లాడాడు: ఇది మోయాబులో యొర్దాను లోయలో, యొర్దాను నది దగ్గర, యెరికో అవతల జరిగింది. యెహోవా ఇలా చెప్పాడు:


కనుక అర్బోతు మోయాబు ప్రాంతంలో, శ్రేష్ఠ యొర్దాను నది ప్రక్కన, యెరికో దగ్గర మోషేకు యెహోవా ఇచ్చిన చట్టాలు, ఆజ్ఞలు అవి. ఆ చట్టములను, ఆజ్ఞలను మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు.


ఇప్పుడు వారు యొర్దాను నదికి తూర్పున మోయాబు దేశంలో ఉన్నారు, మరియు దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను మోషే వివరించటం మొదలుబెట్టాడు. మోషే ఇలా చెప్పాడు:


“ఈ విధంగా, అమోరీ ప్రజల ఇద్దరు రాజుల వద్దనుండి దేశాన్ని మన స్వాధీనం చేసుకొన్నాం. ఈ దేశాలు యొర్దాను నదికి తూర్పు వైపున ఉన్నాయి. అర్నోను లోయనుండి హెర్మోను పర్వతంవరకు ఉంది ఈ దేశం.


మోషే మోయాబు పల్లపు ప్రాంతాల నుండి యెరికో లోయలోని నెబో కొండ మీద పిస్గా శిఖరం మీదికి వెళ్లాడు. గిలాదునుండి దానువరకు దేశం మొత్తం యెహోవా మోషేకు చూపించాడు.


ఇశ్రాయేలు ప్రజలు మోయాబు పల్లపు ప్రాంతాల్లో 30 రోజుల పాటు మోషే కోసం ఏడ్చారు. ఇది పూర్తి సంతాప దినాల సమయము.


సరిగ్గా అప్పుడే నీరు ప్రవహించటం ఆగిపోయింది. (ఆ స్థలం వెనుక నీళ్లు ఆనకట్ట కట్టినట్టు నిలిచిపోయాయి.) నది పొడవునా ఆదాం వరకు (సారెతాను దగ్గర ఒక ఊరు.) నీరు ఎత్తుగా నిలబడ్డాయి. ప్రజలు యెరికో దగ్గర నది దాటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ