Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 18:3 - పవిత్ర బైబిల్

3 లేవీ వంశంలోని ఆ మనుష్యులు నీ స్వాధీనంలో ఉంటారు. గుడారంలో జరగాల్సిన పని అంతా వారు చేస్తారు. అయితే పవిత్ర స్థలంలోగాని, బలిపీఠం దగ్గరగాని ఉన్న వస్తువులను వారు సమీపించకూడదు. ఒకవేళ వారు వెళ్తే, వారూ, నీవు కూడా చనిపోతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లువారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 వారు నీకూ, గుడారం అంతటికీ సేవ చెయ్యాలి. కాని వారూ, మీరూ చనిపోకుండా ఉండాలంటే వారు పవిత్ర స్థలపు ఉపకరణాల దగ్గరకైనా, బలిపీఠం దగ్గరకైనా రాకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 వారు నీకు బాధ్యత వహించాలి, గుడారం యొక్క అన్ని విధులను నిర్వర్తించాలి, అయితే వారు పరిశుద్ధాలయం యొక్క సామాగ్రి దగ్గరకు గాని బలిపీఠం దగ్గరకు గాని వెళ్లకూడదు. లేదంటే వారు మీరు చస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 వారు నీకు బాధ్యత వహించాలి, గుడారం యొక్క అన్ని విధులను నిర్వర్తించాలి, అయితే వారు పరిశుద్ధాలయం యొక్క సామాగ్రి దగ్గరకు గాని బలిపీఠం దగ్గరకు గాని వెళ్లకూడదు. లేదంటే వారు మీరు చస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 18:3
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

“కావున యాజకులవలె లేవీయులు నాకు అర్పణలు తీసుకొనిరారు. నా పవిత్ర వస్తువుల వద్దకు గాని, అతి పవిత్రమైనవిగా తలచబడేవాటి దరిదాపులకు గాని వారు రారు. వారు చేసిన నీచమైన పనులకు అవమానాన్ని వారు భరించాలి.


పవిత్ర గుడారం ఎప్పుడైనా ముందుకు తీసుకుని పోదలిస్తే లేవీ మనుష్యులే అది చేయాలి. ఎప్పుడైనా సరే ఒకచోట పవిత్రగుడారం వేయబడితే, అది లేవీ మనుష్యులే వేయాలి. పవిత్ర గుడారం విషయం జాగ్రత్త తీసుకునేవారు వాళ్లే. లేవీ కుటుంబానికి చెందనివారు ఇంకెవరయినా గుడారాన్ని గూర్చి శ్రద్ధ తీసుకునేందుకు ప్రయత్నిస్తే, అతడు చంపివేయబడతాడు.


అయితే లేవీ ప్రజలు పవిత్ర గుడారం చుట్టూ డేరాలు వేయాలి. ఒడంబడిక పవిత్ర గుడారాన్ని లేవీ ప్రజలు కాపాడుతారు. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి కీడూ జరుగకుండా వారు పవిత్ర గుడారాన్ని కాపాడుతారు.”


మోషే ద్వారా యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఇలా చేసాడు. అహరోను కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే యెహోవా ఎదుట ధూపం వేయాలని ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఇది సహాయకరమైన సూచన. ఇంకొక వ్యక్తి గనుక యెహోవా ఎదుట ధూపం వేస్తే, అతడు కోరహు, అతని అనుచరుల్లా అవుతాడు.


వారు నీతో కలిసి పనిచేస్తారు. సన్నిధి గుడారం విషయమై జాగ్రత్త తీసుకోవటం వారి బాధ్యత. గుడారంలో జరగాల్సిన పని అంతా వాళ్లు చేస్తారు. నీవు ఉన్న చోటికి ఇంకెవ్వరూ రాకూడదు.


అయితే నీవు, నీ కుమారులు మాత్రమే యాజకులుగా పని చేయవచ్చు. బలిపీఠం దగ్గరకు వెళ్లగలిగేది మీరు మాత్రమే. మీరు మాత్రమే తెర లోపలకు వెళ్లగలవారు. యాజకునిగా మీ సేవ అనేది నేను మీకు కానుకగా ఇస్తున్నాను. అతి పవిత్ర స్థలాన్ని ఇంకెవరు సమీపించినా వారిని చంపెయ్యాలి.”


పవిత్ర గుడారం, దాని కప్పు, వెలుపలి గుడారం కాపాడుట పవిత్ర గుడారంలో గెర్షోనీ ప్రజల బాధ్యత. సన్నిధి గుడారం ప్రవేశంలో ఉన్న తెర బాధ్యత కూడా వారే తీసుకున్నారు.


పవిత్ర పెట్టె, బల్ల, దీపస్తంభం, పవిత్ర స్థలంలోని పాత్రలను కాపాడటం వారి బాధ్యత. తెర విషయం, దానితోబాటు ఉపయోగించిన వస్తువులన్నింటి విషయంకూడా వారు శ్రద్ధ తీసుకున్నారు.


పవిత్ర గుడారపు చట్రాలను కాపాడే బాధ్యత మెరారి ప్రజలకు ఇవ్వబడింది. పవిత్ర గుడారపు చట్రాలతో బాటు వాటి పలకలను, అడ్డకర్రలను, స్తంభాలను. దిమ్మలను, పరికరాలను, దానికి సంబంధించిన వాటన్నింటినీ వారు కాపాడారు.


ఆ తర్వాత ప్రజల సగభాగంలో ప్రతి 50 వస్తువుల్లోనుంచి ఒక వస్తువు తీసుకో. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు, ఇంకా ఏ జంతువు విషయంలో అయినా ఇలాగే. ఆ భాగం లేవీయులకు ఇవ్వాలి. (ఎందుచేతనంటే యెహోవా పవిత్ర గుడారపు బాధ్యతను లేవీయులు తీసుకొన్నారు గనుక.)”


“అహరోను, అతని కుమారులు పవిత్ర స్థలంలో పవిత్ర వస్తువులన్నింటినీ కప్పటం అయిన తర్వాత, కహాతు కుటుంబపు పురుషులు లోనికి వెళ్లి, ఆ వస్తువులను మోయటం మొదలు పెట్టవచ్చు. ఈ విధంగా వారు చావకుండా ఉండేలా పవిత్ర స్థలాన్ని తాకరు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ