Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 18:10 - పవిత్ర బైబిల్

10 అవి అత్యంత పవిత్రమైనవిగా వాటిని తినాలి. నీ కుటుంబంలో మగవారు ప్రతి ఒక్కరూ దానిని తినాలి. అది పవిత్రం అని నీవు చెప్పాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 ప్రతి మగవాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 మీలో ప్రతి మగవాడు ఈ అర్పణలు తినాలి. అవి నాకు ప్రత్యేకించిన అర్పణలుగా మీరు పరిగణించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 అవి అతి పవిత్రంగా ఎంచి తినాలి. ప్రతి మగవాడు అది తినాలి. వాటిని పవిత్రమైనవిగా పరిగణించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 అవి అతి పవిత్రంగా ఎంచి తినాలి. ప్రతి మగవాడు అది తినాలి. వాటిని పవిత్రమైనవిగా పరిగణించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 18:10
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ మనిషి నాతో ఇలా అన్నాడు: “నియమిత స్థలానికి అడ్డంగా ఉన్న ఉత్తర గదులు, దక్షిణ గదులు పవిత్రమైనవి. యెహోవాకు బలులు సమర్పించే యాజకులకు ఈ గదులు కేటాయించబడ్డాయి. ఆ యాజకులు అతి పవిత్ర అర్పణలను ఈ గదులలోనే తింటారు. అతి పవిత్ర అర్పణలను వారక్కడ ఉంచుతారు. ఎందుకంటే, ఈ స్థలం పవిత్రమైనది. అతి పవిత్ర అర్పణలు ఏమంటే: ధాన్యపు నైవేద్యాలు, తప్పులను పరిహరించు బలులు మరియు అపరాధ పరిహారార్థ బలులు.


అది యెహోవా కోసం అగ్నిమీద దహించబడిన అర్పణలలో భాగమైయున్నది. ఆ భాగం నీకు నీ కుమారులకు చెందుతుంది అని నీకు నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రబోధిస్తుంది. అయితే పరిశుద్ద స్థలంలోనే మీరు దాన్ని తినాలి.


మోషే, “ఆ మేకను మీరు పరిశుద్ధ స్థలంలోనే తినాల్సిఉంది. అది చాలా పరిశుద్ధం. దాన్ని యెహోవా ఎదుట మీరెందుకు తినలేదు? ప్రజల దోషాన్ని తీసివేసేందుకు దాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. ఆ మేక బలి ప్రజల పాపాలను తుడిచి వేసేందుకు ఉద్దేశించబడింది.


పాపపరిహారార్థ బలి, దహనబలి వధించే పవిత్ర స్థలంలోనే యాజకుడు మగ గొర్రెపిల్లను వధించాలి. అపరాధపరిహారార్థ బలి పాపపరిహారార్థ బలిలాగే ఉంటుంది. అది యాజకునికే చెందుతుంది. అది చాలా పవిత్రం.


ఆ వ్యక్తి యాజక కుటుంబంలోని వాడు గనుక అతడు పవిత్ర రొట్టెల్ని తినవచ్చును. అతి పవిత్రమైన రొట్టెల్ని కూడా అతడు తినవచ్చును.


“మిగిలిపోయిన ధాన్యార్పణాన్ని అహరోను, అతని కుమారులు తినాలి. ధాన్యార్పణ పొంగని రొట్టెలా ఉంటుంది. యాజకులు ఈ రొట్టెను పవిత్ర స్థలంలో తినాలి. సన్నిధి గుడారపు ఆవరణలో వారు ఈ ధాన్యార్పణను తినాలి.


యెహోవాకు అగ్నిద్వారా అర్పించబడిన అర్పణల్లోనుంచి అహరోను మగ సంతానం అందరూ తినవచ్చును. మీ తరాలన్నింటికీ ఇది శాశ్వత నియమము. ఈ అర్పణల స్పర్శ వారిని పవిత్రులను చేస్తుంది.”


పాపపరిహారార్థబలిని అర్పించే యాజకుడే దానిని తినాలి. సన్నిధి గుడారం యొక్క ఆవరణలో ఒక పరిశుద్ధ స్థలంలో అతడు దానిని తినాలి.


“యాజకులలో ప్రతి ఒక్కడూ పాపపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం.


“యాజకుని కుటుంబంలో ఏ పురుషుడైనాసరే అపరాధపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం గనుక దాన్ని ఒక పరిశుద్ధ స్థలంలోనే తినాలి.


“ఇశ్రాయేలు ప్రజలు నైవేద్యంగా ఇచ్చు అర్పణలు అన్నీ నీవే. ఇది నీకూ, నీ కుమారులకు, కుమార్తెలకు నేను ఇస్తున్నాను. ఇది నీ వంతు. నీ కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ దీనిని తినగలుగుతాడు.


దహించబడని పవిత్ర అర్పణలన్నింటిలో మీకు వంతు ఉంటుంది. ప్రజలు తమ కానుకులను అతి పవిత్ర అర్పణలుగా నా దగ్గరకు తీసుకుస్తారు. ఇవి ధాన్యార్పణలు, పాప పరిహారార్థ అర్పణలు, అపరాధ పరిహారార్థ అర్పణలు. అయితే ఇవన్నీ నీవి, నీ కుమారులవి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ