Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 15:14 - పవిత్ర బైబిల్

14 మరియు రాబోయే కాలమంతటిలో ఇశ్రాయేలు కుటుంబంలో జన్మించనివాడు మీ మధ్య నివసిస్తుంటే, అతడు కూడా వీటన్నింటికీ విధేయుడు కావాలి. నేను నీకు చెప్పిన విధంగానే అతడు ఇవన్నీ చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 మీయొద్ద నివసించు పరదేశిగాని మీ తరతరములలో మీ మధ్యనున్నవాడెవడుగాని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము అర్పింప గోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 మీ దగ్గర నివాసం ఉన్న పరదేశిగాని, మీ తరతరాల్లో మీ మధ్య ఉన్నవాడు ఎవడైనా గాని యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పించాలని అనుకున్నప్పుడు, మీరు చేసినట్టే అతడు కూడా చెయ్యాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 వచ్చే తరాలకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. విదేశీయులు లేదా మీ మధ్య నివసించే ఎవరైనా సరే, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించాలనుకుంటే, మీలాగే వారు కూడా చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 వచ్చే తరాలకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. విదేశీయులు లేదా మీ మధ్య నివసించే ఎవరైనా సరే, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించాలనుకుంటే, మీలాగే వారు కూడా చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 15:14
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

“అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలు ప్రజలు అందరితో ఇలా చెప్పు: ఒకవేళ ఒక ఇశ్రాయేలు పౌరుడు, లేక ఒక విదేశీయుడు ఒక అర్పణ తీసుకొని రావాలను కొంటాడు. ఒకవేళ అది ఆ వ్యక్తి చేసుకొన్న ఏదో ఒక ప్రత్యేక వాగ్దానంగా కావచ్చు లేక ఒకవేళ ఆ వ్యక్తి ఇవ్వాలనుకొన్న ఒక ప్రత్యేక బలి కావచ్చు.


“విదేశీయుల దగ్గర్నుండి జంతువుల్ని యెహోవాకు బలిగా మీరు తీసుకోగూడదు. ఎందుచేతనంటే ఆ జంతువులు ఏ విధంగానైనా దెబ్బతిన్నాయేమో, లేదా వాటిలో ఏదైనా లోపం ఉండొచ్చు అందుచేత అవి అంగీకరించబడవు!”


“ప్రజలు ఇలా దహన బలులు అర్పించినప్పుడు వారు యెహోవాను సంతోషపెడతారు. అయితే ఇశ్రాయేలీయుల్లో ప్రతి పౌరుడూ వీటన్నింటినీ నేను నీతో చెప్పినట్టే చేయాలి.


ఇశ్రాయేలు వంశంలో పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతరులకు ఒకే రకమైన నియమాలు ఉండాలి. ఈ ఆజ్ఞ ఇప్పటినుండి భవిష్యత్తు వరకు కొనసాగుతుంది. మీరు, మీ మధ్య ఉండే ఇతరులు అంతా ఒకటే యెహోవా ఎదుట.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ