Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 11:11 - పవిత్ర బైబిల్

11 మోషే యెహోవాను అడిగాడు, “యెహోవా, నీ సేవకుడనైన నాకు ఇంత కష్టం ఎందుకు కలిగించావు? నేనేమి పొరబాటు చేసాను? నీకు సంతోషం లేకుండేటట్టు నేను చేసింది ఏమిటి? ఈ ప్రజలందరి బాధ్యత నీవు నాకెందుకు ఇచ్చావు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 కాగా మోషే యెహోవాతో యిట్లనెను–నీవేల నీ సేవకుని బాధించితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నామీద పెట్టనేల?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. “నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 మోషే యెహోవాతో, “మీ సేవకునిపై ఈ కష్టం ఎందుకు తెచ్చారు? వీరందరి భారం నా మీద వేయకుండ మీ దృష్టిలో నేనెందుకు దయను పొందలేకపోయాను?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 మోషే యెహోవాతో, “మీ సేవకునిపై ఈ కష్టం ఎందుకు తెచ్చారు? వీరందరి భారం నా మీద వేయకుండ మీ దృష్టిలో నేనెందుకు దయను పొందలేకపోయాను?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 11:11
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను దేవునితో చెబుతాను, ‘నన్ను నిందించవద్దు. నేను ఏమి తప్పు చేశాను, నాకు చెప్పు. నా మీద నీకు ఎందుకు విరోధం?


యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే ఒక్క మనిషి కూడా మిగలడు.


నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు. నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.


కనుక మోషే, “ఈ ప్రజల్ని నేనేమి చేయాలి? నన్ను చంపెయ్యటానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు” అంటూ యెహోవాకు మొరబెట్టాడు.


అప్పుడు మోషే యెహోవాను ప్రార్థించి, “ప్రభువా, ఎందుకు ఇలా నీ ప్రజలకు నీవు కీడు చేసావు? నీవు ఇక్కడికి నన్నెందుకు పంపించావు?


తల్లీ, నీవు నాకు జన్మ ఇవ్వనట్లయితే బాగుండేది. నేను దుఃఖపడుతున్నాను. నేను దురదృష్టవంతుడను. ఈ సమస్త రాజ్యాన్నీ నేను (యిర్మీయా) నిందిస్తూ, విమర్శిస్తూ ఉన్నాను. నేనెవరికీ ఏదీ అప్పు యివ్వలేదు; అరువు తీసుకోలేదు. కాని ప్రతివాడూ నన్ను శపిస్తున్నాడు!


నేనింకా ఎందుకు బాధపడుతున్నానో నాకు అర్థం కావటంలేదు. నా గాయం ఎందుకు నయంకాలేదో, ఎందుకు తగ్గడంలేదో నాకు అర్థంకావటం లేదు. యెహోవా, నీవు మారి పోయావేమోనని అనుకుంటున్నాను. నీవు ఎండిపోయిన సెలయేటిలా ఉన్నావు. నీవు ఇంకిపోయిన నీటిబుగ్గలా ఉన్నావు.


“యెహోవాను ఆరాధించటం వ్యర్థం. యెహోవా మాకు చెప్పిన వాటిని మేము చేసాం, కాని మాకు లాభం ఏమీ కలుగలేదు. సమాధి దగ్గర మనుష్యులు ఏడ్చినట్టు, మేము మా పాపాల విషయంలో బాధపడ్డాం. కానీ దానివల్ల లాభం లేదు.


ప్రతి కుటుంబం వాళ్లు ఫిర్యాదు చేయటం మోషే విన్నాడు. ప్రజలంతా వారివారి గుడారాల్లో గొణుగుతున్నారు. యెహోవాకు చాల కోపం వచ్చింది. దానితో మోషేకు చాలా చికాకు కలిగింది.


వారి కష్టాలన్నీ నీవు నా మీదే పెట్టాలనుకొంటే, ఇప్పుడే నన్ను చంపేయి. నన్ను నీ సేవకునిగా నీవు అంగీకరిస్తే, నన్ను ఇప్పుడే చావనివ్వు. అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయి.”


ఇవే కాక, సంఘాల కొరకు నేను ప్రతిరోజూ దిగులు పడుతుంటాను.


కానీ నేను మీ విషయం శ్రద్ధ తీసుకోలేను, నేనొక్కడనే మీ వివాదాలు తీర్చలేను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ