34 మా రాజులుగాని మా ప్రధానులుగాని మా యాజకులుగాని మా పితరులుగాని నీ ధర్మశాస్త్రము ననుసరించి నడువలేదు. నీవు వారిమీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి.
34 మా రాజులు, ప్రధానులు, యాజకులు, మా పూర్వీకులు నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోలేదు. నువ్వు వారికి ఇచ్చిన హెచ్చరికలను, నీ ఆజ్ఞలను వారు పెడచెవిన పెట్టారు.
ఇశ్రాయేలుని యూదాని హెచ్చరిక చేసేందుకు యెహోవా ప్రతి ప్రవక్తను, దీర్ఘదర్శిని ఉపయోగించాడు. “మీరు చేసే చెడు పనులకు అయిష్టత చూపండి. నా ఆజ్ఞలను చట్టాలను పాటించండి. మీ పూర్వికులకు నేనిచ్చిన ధర్మశాస్త్రమును మీరు అనుసరించండి. ఈ ధర్మశాస్త్రాన్ని నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అందించాను” అని యెహోవా చెప్పాడు.
ప్రజలు యెహోవా చట్టాలను అంగీకరించలేదు. తమ పూర్వికులతో యెహోవా చేసిన ఒడంబడికను అంగీకరింలేదు. వారు యెహోవా చేసిన హెచ్చరికలను పాటించలేదు. ఎందుకు విలువలేని విగ్రహములను వారు కొలిచారు, మరియు వారు ఎందుకు విలువలేనివారయ్యారు. తమ చుట్టూ వున్న జనాంగములవలె వారు ఆ ప్రజల చెడు జీవిత పద్దతిని అనుసరించారు. మరియు యెహోవా ఇశ్రాయేలు ప్రజలను, హెచ్చరించి, ఆ చెడు పనులు చేయవద్దని చెప్పాడు.
“నీవు మా పూర్వీకుల పట్ల చాలా ఓర్పు వహించావు. వాళ్లు నీతో సరిగా వ్యవహరించక పోయినా చాలా సంవత్సరాలు వాళ్లని సహించావు. నీ ఆత్మతో వాళ్లని హెచ్చరించావు. వాళ్లని హెచ్చరించేందుకు ప్రవక్తల్ని పంపావు. కాని మా పూర్వీకులు వాళ్ల మాటలు వినలేదు. అందుకే నీవు వాళ్లని విదేశాల్లోని మనుష్యులకు అప్పగించావు.
తమ స్వదేశంలో నివసించినప్పుడు సైతం మా పూర్వీకులు నీకు సేవ చేయలేదు. వాళ్లు దుష్టకార్యాలు చేయడం మానలేదు. నీవు వాళ్లకిచ్చిన అద్భుతమైన వాటన్నిటినీ హాయిగా అనుభవించారు. వాళ్లు సారవంతమైన భూమిని అనుభవించారు సువిశాల దేశాన్ని ఏలుకున్నారు, అయినా, తమ దుర్మార్గాలు వీడలేదు.
యెరూషలేము ప్రజలు నా సందేశాన్ని పెడచెవిని పెట్టారు గనుక నేనివన్నీ చేయ సంకల్పించాను.” ఇదే యెహోవా వాక్కు. “నా సందేశాన్ని వారికి అనేక పర్యాయాలు పంపియున్నాను. నా సేవకులైన ప్రవక్తలను నా సందేశం ఆ ప్రజలకు అందజేయటానికి వినియోగించాను. కాని ఆ ప్రజలు వినలేదు.” ఇది యెహోవా వాక్కు.
ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు సమర్పిస్తామని మేము మొక్కుకున్నాము. మేము మొక్కుకున్న విధంగా అంతా చేస్తాము. ఆమెకు పూజలో బలులు అర్పించి, పానార్పణ సమర్పిస్తాము. గతంలో మేమలా చేశాం. గతకాలంలో మా పూర్వీకులు, మా రాజులు, మా అధికారులు అలా చేశారు. యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను మేమంతా అలా చేశాం. ఆకాశ రాణిని మేము ఆరాధించినపుడు మాకు పుష్కలంగా ఆహారం దొరికింది. మాకు విజయం చేకూరింది. మాకు ఏ కీడూ సంభవించలేదు.
ఆ ప్రజల వద్దకు నా ప్రవక్తలను అనేక పర్యాయాలు పంపియున్నాను. ఆ ప్రవక్తలు నా సేవకులు. ఆ ప్రవక్తలు నా సందేశాన్ని ప్రజలకు చెప్పారు. మీరీ భయంకరమైన పని చేయవద్దు. విగ్రహారాధన విషయమై మిమ్మల్ని నేను అసహ్యించు కుంటున్నట్లు వారు ప్రజలకు చెప్పారు.
ఆ ప్రజలు నా ఆజ్ఞలను ధిక్కరించారు. ఇతర దేశాల వారికంటె వీరు మిక్కిలి హీనులయ్యారు. వారిచుట్టూ వున్న దేశాల ప్రజలకంటె ఈ ప్రజలే నా ధర్మాన్ని ఎక్కువగా ఉల్లంఘించారు. నా ఆజ్ఞలను వినటానికి వారు నిరాకరించారు! నా నియమాలను వారు మన్నించ లేదు!”
అప్పుడు వాళ్లకు ఎన్నో భయంకర సంగతులు జరుగుతాయి, వారికి ఎన్నో కష్టాలు వస్తాయి. అప్పటికి ఇంకా వారి ప్రజలకు ఈ పాట జ్ఞాపకం ఉంటుంది, వారిది ఎంత తప్పు అని యిది వారికి తెలియజేస్తుంది. నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి నేను యింకా వారిని తీసుకొని వెళ్లలేదు; కానీ వాళ్లు అక్కడ ఏం చేయాలని పథకం వేస్తున్నారో నాకు అప్పుడే తెలుసు.”