Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 7:64 - పవిత్ర బైబిల్

64 వీళ్లు తమ కుటుంబ చరిత్రల కోసం గాలించారు, కాని అవి వాళ్లకి దొరకలేదు. తాము యాజకులుగా పని చేయగలిగేందుకు గాను, తమ పూర్వీకులు యాజకులన్న విషయాన్ని వాళ్లు నిరూపించలేక పోయారు. దానితో, వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో చేర్చబడలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

64 వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

64 వారు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ అవి కనబడలేదు. కాబట్టి వారిని అపవిత్రమైన వారుగా ఎంచి యాజకుల జాబితా నుండి తొలగించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

64 వీరు తమ వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

64 వీరు తమ వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 7:64
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయి. యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవంతంగా బబులోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరిగింది.


ఓ నా దేవా, నీవు వాళ్లని శిక్షించు. వాళ్లు యాజకత్వాన్ని అపవిత్రం చేశారు. అదేదో అంత ముఖ్యం కాదన్నట్లు వాళ్లు వ్యవహరించారు. యాజకులతోనూ, లేవీయులతోనూ నీవు చేసుకున్న ఒడంబడికను వాళ్లు పాటించలేదు.


జనం అందర్నీ సమావేశ పరచాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ సమావెశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో చేశాను. మొదట దేశమునుండి వెళ్లగొట్టబడిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు దొరికాయి. అక్కడ వ్రాసివున్న సమాచారం ఇది.


యాజక కుటుంబాల్లో చేరినవాళ్లు హబాయా, హక్కోజు, బర్జిల్లయి (గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలను పెళ్లి చేసుకున్నవాళ్లు బర్జిల్లయి వంశీయులుగా పరిగణింపబడ్డారు.)


అత్యంత పవిత్రమైన వస్తువులను వాళ్లకి ఇవ్వరాదని పాలనాధికారి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధాన యాజకుడు ఊరీము, తుమ్మీము ఉపయోగించి, దేవుని సంకల్పం తెలుసుకునేందుకోసం అర్థించి, ప్రార్థించేదాకా వాళ్లు ఈ అతి పరిశుద్ధ వస్తువుల్లో వేటికీ అర్హులు కాకుండా పోయారు.


“అభిషేకించబడిన యాజకుడు పాపం చేసి, ప్రజలమీదికి దోషం రప్పిస్తే, అప్పుడు అతడు తాను చేసిన పాపం నిమిత్తం యెహోవాకు ఒక అర్పణను అర్పించాలి. ఏ దోషమూ లేని ఒక కోడెదూడను అతడు అర్పించాలి. పాపపరిహారార్థ బలిగా ఆ కోడెదూడను అతడు అర్పించాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ