నెహెమ్యా 7:4 - పవిత్ర బైబిల్4 అప్పుడు ఆ నగరం విశాలంగా పుంది, కావలసినంతకన్న ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడింది. అయితే, నగరంలో కొద్దిమందే వున్నారు. ఇళ్లు తిరిగి ఇంకా నిర్మింపబడలేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఇప్పుడు పట్టణం విశాలంగా పెద్దదిగా ఉంది. జనాభా కొద్దిమందే ఉన్నారు. ఎవరూ ఇంకా ఇళ్ళు కట్టుకోలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అప్పుడు ఆ పట్టణమెంతో విశాలంగా పెద్దగా ఉండేది కాని అక్కడ కొంతమందే ఉండేవారు. ఇంకా ఎవరూ ఇల్లు కట్టుకోలేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అప్పుడు ఆ పట్టణమెంతో విశాలంగా పెద్దగా ఉండేది కాని అక్కడ కొంతమందే ఉండేవారు. ఇంకా ఎవరూ ఇల్లు కట్టుకోలేదు. အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడు నేను హనానీనీ, హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. వాళ్లలో కొంతమందిని నగర రక్షణకుగాను ప్రత్యేక స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గరే పెట్టండి.”
జనం అందర్నీ సమావేశ పరచాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ సమావెశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో చేశాను. మొదట దేశమునుండి వెళ్లగొట్టబడిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు దొరికాయి. అక్కడ వ్రాసివున్న సమాచారం ఇది.