7 గిబ్యోను వాళ్లూ, మిస్పా వాళ్లూ గోడలో తర్వాత భాగాన్ని నిర్మించారు. గిబ్యోనుకు చెందిన మెలట్యా, మేరోనోతుకు చెందిన యాదోనూ పనిచేశారు. గిబ్యోను, మేరోనోతులు యూఫ్రటిసు నది వశ్చిమ ప్రాంత పాలనాధికారుల అజమాయిషీలో వున్నాయి.
7 వారి పక్కన గిబియోనీయుడు మెలట్యా, మేరోనీతీవాడు యాదోను బాగుచేశారు. వాళ్ళు గిబియోను, మిస్పా పట్టణాల ప్రముఖులు. నది అవతలి ప్రాంతం గవర్నరు నివసించే భవనం వరకూ ఉన్న గోడను వారు బాగు చేశారు.
7 ఆ ప్రక్క నుండి గిబియోను, మిస్పా పట్టణస్థులైన గిబియోనీయుడైన మెలట్యా, మేరోనోతీయుడైన యాదోను బాగుచేశారు. యూఫ్రటీసు నది అవతలి అధిపతుల ఆధీనంలో ఉన్న స్థలాల వరకు వారు బాగుచేశారు.
7 ఆ ప్రక్క నుండి గిబియోను, మిస్పా పట్టణస్థులైన గిబియోనీయుడైన మెలట్యా, మేరోనోతీయుడైన యాదోను బాగుచేశారు. యూఫ్రటీసు నది అవతలి అధిపతుల ఆధీనంలో ఉన్న స్థలాల వరకు వారు బాగుచేశారు.
(గిబియోనీయులు ఇశ్రాయేలు వారు కాదు. చావగా మిగిలిన అమ్మోరీయులకు చెందిన ఒక గుంపువారు. ఇశ్రాయేలీయులు వారికి కీడు చేయబోమని గిబియోనీయులకు ప్రమాణ పూర్వకంగా చెప్పియున్నారు. కాని సౌలు ఇశ్రాయేలీయుల పట్ల, యూదా వారి పట్ల ప్రేమకలవాడై గిబియోనీయులను చంపబూనాడు) దావీదు రాజు గిబియోనీయులను పిలిచాడు. అతడు వారితో మాట్లాడాడు.
ఆ తరువాత రాజైన ఆసా యూదా ప్రజలను సమావేశపర్చాడు. వారంతా రామా పట్టణానికి వెళ్లి బయెషా కోట కట్టించటానికి తెప్పించిన రాళ్లను, కలపను పట్టుకుపోయారు. ఆసా, యూదా ప్రజలు ఆ రాళ్లను, కలపను గెబ, మిస్పా పట్టణాలను బలంగా కట్టడానికి వినియోగించారు.