Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 2:3 - పవిత్ర బైబిల్

3 అయితేనేమి, నేను భయపడినా కూడా, రాజుతో, “రాజు చిరంజీవిగా వర్ధిల్లాలి! నా పూర్వీకులు సమాధి చేయబడిన నగరం శిథిలమైంది. ఆ నగర ప్రాకార ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి” అని విన్నవించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 నేను మిగుల భయపడి–రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 అప్పుడు నేను “రాజు చిరకాలం జీవించాలి. నా పూర్వీకుల సమాధులున్న పట్టణం శిథిలమైపోయింది. దాని కోట తలుపులు తగలబడి పోయాయి. మరి నా ముఖం విచారంగా కాక ఇంకెలా ఉంటుంది?” అని రాజుతో అన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 నేను రాజుతో, “రాజు చిరకాలం జీవించును గాక! నా పూర్వికులను పాతిపెట్టిన పట్టణం శిథిలావస్థలో ఉండి, దాని ద్వారాలు అగ్నికి ఆహుతి అయినప్పుడు నా ముఖం ఎందుకు విచారంగా కనిపించకూడదు?” అన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 నేను రాజుతో, “రాజు చిరకాలం జీవించును గాక! నా పూర్వికులను పాతిపెట్టిన పట్టణం శిథిలావస్థలో ఉండి, దాని ద్వారాలు అగ్నికి ఆహుతి అయినప్పుడు నా ముఖం ఎందుకు విచారంగా కనిపించకూడదు?” అన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 2:3
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

తరువాత బత్షెబ రాజుముందు సాగిలపడి, “రాజైన దావీదు వర్ధిల్లు గాక!” అని అన్నది.


నెబుకద్నెజరు బబులోను రాజుగా వున్న 19 వ సంవత్సరమున, 5 వ నెలలో 7వ తేదీన యెరూషలేముకు వచ్చాడు. నెబూజరదాను నెబుకద్నెజరు అత్యుత్తమ సైనికులకు అధిపతి.


యెహోరాము రాజయ్యే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. యెహోరాము చనిపోయినప్పుడు ఒక్కడు కూడ విచారించలేదు. యెహోరామును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారుగాని, రాజులను వుంచే చోట అతనిని సమాధి చేయలేదు.


ఆహాజు చనిపోగా, అతడు అతని పూర్వీకులతోపాటు సమాధి చేయబడ్డాడు. ప్రజలు ఆహాజును యెరూషలేము నగరంలో సమాధి చేశారు. కాని ఆహాజును ఇశ్రాయేలు రాజులను సమాధిచేసే చోట మాత్రం వారు సమాధి చేయలేదు. ఆహాజు స్థానంలో అతని కుమారుడు హిజ్కియా కొత్త రాజయ్యాడు.


హిజ్కియా చనిపోగా అతడు తన పూర్వీకుల వద్ద సమాధి చేయబడినాడు. దావీదు పూర్వీకుల సమాధులున్న కొండమీద ప్రజలు హిజ్కియాను సమాధి చేశారు. హిజ్కియా చనిపోయినప్పుడు యూదా ప్రజలందరు, మరియు యెరూషలేములో నివసిస్తున్నవారు అతనికి ఘనంగా నివాళులర్పించారు. హిజ్కియా స్థానంలో మనష్షే కొత్త రాజయ్యాడు. మనష్షే హిజ్కియా కుమారుడు.


నెబుకద్నెజరు, అతని సైన్యం ఆలయాన్ని తగులబెట్టారు. వారు యెరూషలేము గోడను పడగొట్టి రాజుకు, రాజాధికారులకు చెందిన ఇండ్లన్నీ తగులబెట్టారు. ప్రతి విలువైన వస్తువును వారు తీసికొనటం గాని, లేక నాశనం చేయటంగాని చేశారు.


హనానీయ, అతనితో ఉన్న వాళ్లూ ఇలా చెప్పారు: “నెహెమ్యా, చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లకి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. ఎందుకంటే, యెరూషలేము ప్రాకారం కూల్చబడింది. దాని ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి.”


చీకట్లో నేను లోయ ద్వారం గుండా బయటికి వెళ్లాను. నేను నక్కల బావి దిక్కున సవారీచేస్తూ పోయి, బూడిద రాశుల ద్వారం దగ్గరికి పోయాను. నేను యెరూషలేము గోడలు తనిఖీ చేస్తూ పోయాను. గోడలు శిథిలమయ్యాయి, ద్వారాలు కాలిపోయి వున్నాయి.


నా ప్రజలు ఇలాంటి ఘోరమైన విపత్తులకు గురికావడం నేను సహించలేను. నా కుటుంబ సభ్యులు హతమార్చబడటం నేను భరించలేను. అందుకే, మహారాజావారిని ఈ ఘోరాన్ని ఆపు చెయ్యవలసిందిగా అర్థిస్తున్నాను.”


యెరూషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు.


జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు. దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు.


యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకుపోవును గాక! నేను ఎన్నటికీ నిన్ను మరువనని వాగ్దానం చేస్తున్నాను.


నా నడుము వేడిగా కాలిపోతోంది. నా శరీరం అంతా బాధగా ఉంది.


బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు. రాజైన నెబుకద్నెజరు పాలనలో పందొమ్మిదవ సంవత్సరం ఐదవనెలలో పదవ రోజున అతను వచ్చాడు. బబులోనులో నెబూజరదాను ఒక ముఖ్యమైన నాయకుడు.


యోరూషలేము ద్వారాలు భూమిలోకి క్రుంగి పోయాయి. ద్వారాల కడ్డీలను ఆయన నుగ్గు నుగ్గు చేశాడు. ఆమె యొక్క రాజు, యువరాజులు పరదేశాలకు పోయి ఉన్నారు. వారికి ఇక ఎంత మాత్రం ఉపదేశం లేదు. యెరూషలేము ప్రవక్తలకు కూడా యెహోవా నుండి దర్శనాలు ఏమీలేవు.


తర్వాత కల్దీయులు రాజుతో సిరియా భాషలో, “రాజా, వర్థిల్లుము. మేము నీ సేవకులం. దయచేసి నీ కల ఏమిటో చెప్పుము. ఆ తర్వాత దాని అర్థం మేము చెబుతాము” అని అన్నారు.


వాళ్లు నెబుకద్నెజరుతో ఇలా అన్నారు: “రాజు ఎల్లప్పుడూ వర్ధిల్లు గాక!


విందు జరుగుతున్న ఆ ప్రదేశానికి రాజుయొక్క తల్లి వచ్చింది. ఆమె రాజు, అతని అధికారుల మాటలు విన్నది. “రాజా, నీవు చిరకాలం వర్థిల్లాలి. ఏమీ భయపడకు. భయంతో నీ ముఖం కలత చెంద నివ్వకు.


“రాజా, నీవు చిరకాలము వర్ధిల్లాలి!


అందువల్ల ఆ ఇద్దరు ప్రధానులు, రాజ్యాధికారులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లి, “దర్యావేషు రాజు వర్ధిల్లాలి.


మీ పట్టణాలను నేను నాశనం చేస్తాను. మీ పరిశుద్ధ స్థలాన్ని నేను శూన్యం చేస్తాను. మీ అర్పణల సువాసన నేను ఆఘ్రాణించను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ