“యెహోవా ఆలయపు సరుకుల కొట్ల దగ్గరికి తెచ్చి, ఈ క్రింది వస్తువులు యాజకులకి సమర్పిస్తాము: మొదటివిడత ఆడిన పిండి, ధాన్యార్పణలో మొదటి భాగం, మా ఫల వృక్షాలన్నింటి మొదటి పండ్లు మా కొత్త ద్రాక్షారసం నుంచీ, నూనె నుంచీ మొదటి భాగం, మా పంటల్లొ పదోవంతును లేవీయులకి సమర్పిస్తాము. మేము పనిచేసే ఆయా ప్రాంతాల్లో లేవీయులు వీటిని వసూలు చేస్తారు. అందుకే మేము వారికి ఇస్తాము.
యాజకులూ, లేవీయులూ తమ దేవునిపట్ల భక్తిభావంతో ఈ పనులు చేశారు. వాళ్లు జనాన్ని పరిశుద్ధులను చేసే విధానాలు ఆచరించారు. గాయకులూ, ద్వారపాలకులూ తమ తమ విధులను నిర్వర్తించారు. దావీదూ, సొలొమోనూ ఆదేశించిన పనులన్నీ వాళ్లు చేశారు.