నెహెమ్యా 12:44 - పవిత్ర బైబిల్44 ఆ రోజున వస్తుపులను భద్రపరచు గదులలో భద్రపరచు కొందరిని నియమించారు. జనం తమ తొలికాపు ఫలాలను, పదోవంతు పంటలను తీసుకు వచ్చారు. వస్తువులను భద్రపరచువారు వాటిని వస్తువులను భద్రపరచు గదులలో పదిలపరిచారు. బాధ్యులుగా వున్న యాజకుల, లేవీయుల విషయంలో యూదా జనసామాన్యం చాలా తృప్తి చెందారు. అందుకని, వాళ్లు గిడ్డంగుల్లో పెట్టేందుకు చాలా వస్తువులు తెచ్చారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్ఠార్పణలకును ప్రథమ ఫలములకును పదియవవంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదులమీద కొందరు నియమింపబడిరి, వారు యాజకుల కొరకును లేవీయులకొరకును ధర్మశాస్త్రాను సారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలములనుండి సమకూర్చుటకు నియమింపబడిరి; సేవచేయుటకు నియమింపబడిన యాజకులనుబట్టియు, లేవీయులనుబట్టియు యూదులు సంతోషించిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 ఆ కాలంలో పదార్థాలను, ప్రతిష్టిత వస్తువులను, ప్రథమ ఫలాలను, దశమ భాగాలను ఉంచే గిడ్డంగులను కాపలా కాయడానికి కొందర్ని నియమించారు. యాజకుల, లేవీయుల కోసం, ధర్మశాస్త్రం ప్రకారం నిర్ణయించిన భాగాలను పట్టణాల నుండి, పొలాల నుండి సమకూర్చడానికి వీరిని నియమించారు. పరిచర్య చేయడానికి యాజకులు, లేవీయులను నియమించగా యూదులు సంతోషించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 ఆ సమయంలో ప్రజలిచ్చే ప్రథమ ఫలాలు, పదవ భాగాలు కానుకలకు సంబంధించిన గిడ్డంగులకు అధికారులుగా కొంతమంది నియమించబడ్డారు. పరిచర్య చేస్తున్న యాజకులు లేవీయులను బట్టి యూదా ప్రజలు సంతోషించారు కాబట్టి యాజకులు లేవీయుల కోసం ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన వంతులను పట్టణాల చుట్టూ ఉన్న పొలాల నుండి గిడ్డంగులకు చేరవేయడానికి వారు నియమించబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 ఆ సమయంలో ప్రజలిచ్చే ప్రథమ ఫలాలు, పదవ భాగాలు కానుకలకు సంబంధించిన గిడ్డంగులకు అధికారులుగా కొంతమంది నియమించబడ్డారు. పరిచర్య చేస్తున్న యాజకులు లేవీయులను బట్టి యూదా ప్రజలు సంతోషించారు కాబట్టి యాజకులు లేవీయుల కోసం ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన వంతులను పట్టణాల చుట్టూ ఉన్న పొలాల నుండి గిడ్డంగులకు చేరవేయడానికి వారు నియమించబడ్డారు. အခန်းကိုကြည့်ပါ။ |