నెహెమ్యా 10:36 - పవిత్ర బైబిల్36 “ధర్మశాస్త్రంలో సరిగ్గా లిఖించబడినట్లే, మేమిలా చేస్తాము: మా తొలిచూలు కొడుకుల్నీ, అలాగే, మొదటి ఈత ఆవుల దూడల్నీ, గొర్రెల, మేకల పిల్లల్నీ మన దేవుని ఆలయానికి, మన యాజకుల దగ్గరికి తెస్తాము. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్నట్టు మా కొడుకుల్లో మొదటి వారిని, మా పశువుల్లో, మందల్లో తొలిచూలు పిల్లలను మన దేవుని మందిరంలో పరిచర్య చేసే యాజకుల దగ్గరికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 “అలాగే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం మా కుమారులలో మొదట పుట్టినవాన్ని, మా పశువుల్లో, మందలలో గొర్రెలలో మొదట పుట్టిన వాటిని యెహోవా ఆలయానికి అక్కడ పరిచర్య చేస్తున్న యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 “అలాగే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం మా కుమారులలో మొదట పుట్టినవాన్ని, మా పశువుల్లో, మందలలో గొర్రెలలో మొదట పుట్టిన వాటిని యెహోవా ఆలయానికి అక్కడ పరిచర్య చేస్తున్న యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. အခန်းကိုကြည့်ပါ။ |
ఆ రోజున వస్తుపులను భద్రపరచు గదులలో భద్రపరచు కొందరిని నియమించారు. జనం తమ తొలికాపు ఫలాలను, పదోవంతు పంటలను తీసుకు వచ్చారు. వస్తువులను భద్రపరచువారు వాటిని వస్తువులను భద్రపరచు గదులలో పదిలపరిచారు. బాధ్యులుగా వున్న యాజకుల, లేవీయుల విషయంలో యూదా జనసామాన్యం చాలా తృప్తి చెందారు. అందుకని, వాళ్లు గిడ్డంగుల్లో పెట్టేందుకు చాలా వస్తువులు తెచ్చారు.
సర్వశక్తిమంతుడైన యెహోవా అంటున్నాడు, “ఈ పరీక్షలో ప్రయత్నించండి. మీకు ఉన్నవాటిలో పదో భాగం నా దగ్గరకు తీసికొని రండి. వాటిని ధనాగారంలో ఉంచండి. నా మందిరానికి ఆహారం తీసికొనిరండి. నన్ను పరీక్షించండి! మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు నేను నిజంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆకాశంనుండి వర్షం కురిసినట్టు, మంచి మంచి విషయాలు మీకు లభిస్తాయి. మీకు సమస్తం, కావలసిన దానికంటె ఎక్కువగా ఉంటాయి.
మీరు ఈజిప్టులో ఉన్నప్పుడు, ఈజిప్టు ప్రజల పెద్ద కుమారులందర్ని నేను చంపాను. ఆ సమయంలో ఇశ్రాయేలు పెద్ద కుమారులందరిని నా వాళ్లుగా నేను అంగీకరించాను. పెద్ద కుమారులందరు నా వారు, పశువులలో ప్రథమంగా పుట్టినవన్నీ నావే. కానీ మీ పెద్దలందరినీ నేను మీకు తిరిగి ఇచ్చివేస్తున్నాను, మరియు లేవీయులను నా వారిగా చేసుకుంటున్నాను. నేను యెహోవాను.”