Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నహూము 2:5 - పవిత్ర బైబిల్

5 అష్షూరు రాజు తన మంచి సైనికులందరినీ పిలుస్తాడు. కాని వారు తొట్రిల్లి దారిలో పడిపోతారు. గోడను రక్షించటానికి వారు దాని వద్దకు పరుగెడతారు. రక్షక కవచాన్ని వారు కిందికి దించుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసికొనగా వారు నడుచుచు పడిపోవుదురు, ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 మిమ్మల్ని ముక్కలుచెక్కలు చేసే వాడు తన పరాక్రమశాలురను పిలిపిస్తున్నాడు. వాళ్ళు రహదారుల్లో పరుగులు పెడుతూ తొట్రుపడతారు. ప్రాకారం దగ్గరికి పరుగెత్తి వచ్చి దాడి చేసే వారి భద్రత కోసం ఏర్పాట్లు చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 నీనెవె తన అధికారులను పిలుస్తుంది, అయినా వారు తమ దారిలో తడబడతారు. వారు నగర గోడకు గుద్దుకుంటారు; రక్షణ కవచం సిద్ధం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 నీనెవె తన అధికారులను పిలుస్తుంది, అయినా వారు తమ దారిలో తడబడతారు. వారు నగర గోడకు గుద్దుకుంటారు; రక్షణ కవచం సిద్ధం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నహూము 2:5
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

అంతా బాగానే వుందని ప్రజలు తలస్తున్నారు. ప్రజలు అంటారు: “బల్ల సిద్ధం చేయండి! బల్లమీద బట్ట పరచండి! తినండి! తాగండి!” కానీ ప్రజలు, “నాయకులారా, లేవండి, యుద్ధానికి సిద్ధపడండి” అని చెప్పాలి.


శత్రువు ఎన్నటికీ అలసిపోడు, పడిపోడు. వారెన్నటికీ నిద్రబోతులుగా నిద్రపోరు. వారి ఆయుధ పట్టాలు ఎల్లప్పుడూ సిద్దమే. వారి చెప్పుల తాళ్లు ఎప్పటికి తెగిపోవు.


నీ రోదనను దేశాలు వింటాయి. నీ ఏడ్పు ప్రపంచమంతా వినపడుతుంది. ఒక ధైర్యశాలి మరియొక ధైర్యశాలి అయిన యోధునిపై పడతాడు. ఆ యోధులిద్దరూ కలిసి క్రింద పడతారు.”


“బబులోను మీదికి విలుకాండ్రను పిలవండి. ఆ నగరాన్ని చుట్టుముట్టమని వారికి చెప్పండి. ఎవ్వరినీ తప్పించుకోనివ్వద్దు. అది చేసిన దుష్టకార్యాలకు తగిన ప్రతీకారం చేయండి. అది ఇతర రాజ్యాలకు ఏమి చేసిందో, దానిని ఆ దేశానికి కూడా చేయండి. బబులోను యెహోవాను గౌరవించలేదు. పరిశుద్దుడైన ఇశ్రాయేలు దేవునిపట్ల అది మూర్ఖంగా ప్రవర్తించింది. కావున బబులోనును శిక్షించండి.


కాని నదివైపు ద్వారాలు తెరచి ఉన్నాయి. శత్రువు లోనికి వచ్చి, రాజ గృహాన్ని నాశనం చేస్తాడు.


అష్షూరు రాజా, నీ గొర్రెల కాపరులు (నాయకులు) నిద్రకుపడ్డారు. శక్తివంతులగు ఆ మనుష్యులు నిద్రిస్తున్నారు. ఇప్పుడు నీ గొర్రెలు (ప్రజలు) పర్వతాలపై చెదిరిపోయాయి. వాటిని మరల్చుకొని వచ్చేవాడు ఎవ్వడూ లేడు.


అశ్వదళం వారు దాడి చేస్తున్నారు. వారి కత్తులు మెరుస్తున్నాయి. వారి ఈటెలు తళుక్కుమంటున్నాయి! అక్కడ ఎంతోమంది చనిపోయారు. శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. శవాలు లెక్కకు మించి వున్నాయి. శవాలకు అడ్డంపడి ప్రజలు తొట్రిల్లుతున్నారు.


వారి గుర్రాలు చిరుతపులులకంటే వేగం కలవి. సూర్యుడు అస్తమించాక అవి తోడేళ్ళకంటె నీచంగా ఉంటాయి. వారి గుర్రపు దళంవారు దూరప్రాంతలనుండి వస్తారు. ఆకలిగొన్న గరుడ పక్షి ఆకాశంనుండి కిందికి దూసుకు వచ్చినట్లు, వారు తమ శత్రువులను వేగంగా ఎదుర్కొంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ