Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మార్కు 4:12 - పవిత్ర బైబిల్

12 ఎందుకంటే, ‘వాళ్ళు ఎప్పుడూ చూస్తారు కాని ఏదీ గ్రహించరు. అన్నీ వింటారు కాని ఒక్కటీ అర్థం చేసుకోరు. వాళ్ళు అలా చేస్తే దేవుని వైపు మళ్ళవచ్చు దేవుడు వాళ్ళను క్షమిస్తాడు.’”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 ఎందుకంటే, వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి. వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 తద్వారా, “ ‘వారు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు, ఎప్పుడూ వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు; లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొంది ఉండేవారు!’”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 తద్వారా, “ ‘వారు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు, ఎప్పుడూ వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు; లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొంది ఉండేవారు!’”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

12 తద్వారా, “ ‘వారు ఎప్పుడూ చూస్తూనే ఉండవచ్చు కాని ఎన్నటికి గ్రహించరు, ఎప్పుడూ వింటూనే ఉండవచ్చు కాని ఎన్నటికి అర్థం చేసుకోరు; లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందివుండేవారు!’”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మార్కు 4:12
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

“కళ్లుండి చూడలేని వాళ్లను బయటకు తీసుకొనిరండి. చెవులు ఉండి వినలేని వాళ్లను బయటకు తీసుకొని రండి.


ఆ మనుష్యులు ఏమి చేస్తున్నారో వారికే తెలియదు. అది వారు గ్రహించరు. అది వారి కళ్లు మూసుకొనిపోయి, వారు చూడలేనట్టు ఉంటుంది. వారి హృదయాలు (మనసులు) అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించవు.


యూదా వంశం వారికి నేను చేయాలని ప్రయత్నిస్తున్న కీడు అంతా బహుశః వారు వినవచ్చు. బహుశః వారు దుష్కార్యాలు చేయటం మాని వేయవచ్చు. వారలాచేస్తే గతంలో వారు చేసిన మహా పాపాలన్నిటినీ నేను క్షమిస్తాను.”


బుద్ధిహీనులైన మూర్ఖుపు జనులారా ఈ వర్తమానం వినండి: మీకు కళ్లు ఉండికూడా చూడరు! మీకు చెవులు ఉండి కూడా వినరు!


“నరపుత్రుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య వున్నావు. వారు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా వుంటున్నారు. నేను వారి కొరకు చేసిన పనులను చూడటానికి వారికి కళ్ళున్నాయి. అయినా వాటినివారు చూడలేరు. వారిని నేను చేయమని చెప్పిన విషయాలను వినటానికి వారికి చెవులున్నాయి. అయినా వారు నా ఆజ్ఞలను వినరు. ఎందువల్లనంటే వారు తిరుగుబాటుదారులు.


మీకు కళ్ళున్నాయి కాని చూడలేరు. చెవులున్నాయి కాని వినలేరు. మీకు జ్ఞాకపం లేదా?


యేసు, “దేవుని రాజ్యం యొక్క రహస్య జ్ఞానం తెలుసుకొనే అవకాశం మీకివ్వబడింది. కాని యితర్లకు, ఆ రహస్యం ఉపమానాలు ఉపయోగించి చెబుతాను. ఎందుకంటే, ‘వాళ్ళు చూస్తున్నట్లే వుండి చూడలేరు, వాళ్ళు వింటున్నదానిని అర్థం చేసుకోలేరు.’


మారుమనస్సు పొంది దేవుని వైపు మళ్ళండి. అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగి వేస్తాడు. మీకు విమోచనం కలిగే రోజులు వస్తాయి.


కానీ జరిగిందేమిటో ఈ రోజూకూ మీకు అర్థంకాలేదు. మీరు చూసిన దానిని, విన్నదానిని యెహోవా మీకు అర్థం కానివ్వలేదు.


తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి.


పడిపోతే మారుమనస్సు పొందేటట్లు చేయటం అసంభవం. ఎందుకంటే, వాళ్ళు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువవేసి చంపుతున్నారు. ఆయన్ని నలుగురిలో అవమానపరుస్తున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ