Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మీకా 7:8 - పవిత్ర బైబిల్

8 నేను పతనమయ్యాను. కానీ, ఓ శత్రువా, నన్ను చూచి నవ్వకు! నేను తిరిగి లేస్తాను. నేనిప్పుడు అంధకారంలో కూర్చున్నాను. కానీ యెహోవాయే నాకు వెలుగు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగి లేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 నా పగవాడా, నా మీద అతిశయించవద్దు. నేను కింద పడినా తిరిగి లేస్తాను. నేను చీకట్లో కూర్చున్నపుడు యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 నా విరోధీ, నా మీద అతిశయించకు, నేను పడిపోయినా తిరిగి లేస్తాను. నేను చీకటిలో కూర్చున్నా, యెహోవా నాకు వెలుగై ఉంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 నా విరోధీ, నా మీద అతిశయించకు, నేను పడిపోయినా తిరిగి లేస్తాను. నేను చీకటిలో కూర్చున్నా, యెహోవా నాకు వెలుగై ఉంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మీకా 7:8
46 ပူးပေါင်းရင်းမြစ်များ  

“నా శత్రువులు నాశనం చేయబడినప్పుడు నేను ఎన్నడూ సంతోషించలేదు. నా శత్రువులకు కష్టాలు కలిగినప్పుడు నేను ఎన్నడూ నవ్వలేదు.


మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు. దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.


కాని నా శత్రువులు నన్ను తరుముతున్నారు. వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు. ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.


ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు. కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!


యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు. నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు. యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం. కనుక నేను ఎవరికి భయపడను.


అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు. నా శత్రువులు వారి రహస్య పథకాల నిమిత్తం తప్పక శిక్షించబడతారు.


దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు. కాని మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.


అతడు తొట్రుపడినా పడిపోడు, ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.


నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు. నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.


యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు. దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు. యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.


మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.


యాకోబు వంశస్తులారా, మీరు యెహోవాను వెంబడించాలి.


‘చెరలోనుండి బయటకు వచ్చేయండి’ అని ఖైదీలతో మీరు చెబుతారు. ‘చీకటిలోనుండి బయటకు వచ్చేయండి’ అని చీకటిలో ఉన్న ప్రజలతో మీరు చెబుతారు. ప్రజలు పయనిస్తూ భోజనం చేస్తారు. ఖాళీ కొండలమీద కూడా వారికి భోజనం ఉంటుంది.


యెహోవాను గౌరవించే ప్రజలు ఆయన సేవకుని మాటకూడా వింటారు. ఆ సేవకుడు ఏం జరుగుతుందో తెలియకుండానే సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తాడు. అతడు వాస్తవంగా యెహోవా నామాన్నే నమ్ముకొంటాడు, మరియు ఆ సేవకుడు తన దేవుని మీద ఆధారపడతాడు.


ఇప్పుడు ఆ ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. కానీ వారు గొప్ప వెలుగు చూస్తారు. మరణంలాంటి చీకటిచోట ఆ ప్రజలు జీవిస్తున్నారు. కానీ “గొప్ప వెలుగు” వారిమీద ప్రకాశిస్తుంది.


“మోయాబూ, నీవు ఇశ్రాయేలును చూచి హేళన చేశావు. ఇశ్రాయేలు ఒక దొంగల గుంపు చేతికి చిక్కింది. నీవు ఇశ్రాయేలును గురించి మాట్లాడిన ప్రతిసారీ నీవు తలపంకించి, ఇశ్రాయేలు కంటె నీవే మెరుగైనట్లు ప్రవర్తించావు.


“బబులోనూ, నీవు ఉద్రేకంతోను, సంతోషంతోను వున్నావు. నీవు నా భూమిని తీసికొన్నావు. ధాన్యంలో చిందులేసే పడుచు ఆవులా నీవు నాట్యం చేస్తున్నావు. గుర్రాలు సంతోషంతో చేసే సకిలింపుల్లా వుంది నీ నవ్వు.


“యిర్మీయా, ఈ విషయం యూదా ప్రజలకు తెలియజేయుము: ‘యెహోవా ఈ విషయాలు చెప్పినాడు: “‘ఒక వ్యక్తి క్రింద పడితే తిరిగి లేస్తాడని మీకు తెలుసు. ఒక వ్యక్తి తప్పుదారిలో వెళ్లితే అతడు మరల తిరిగి వెనుకకు వస్తాడు.


యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: యెరూషలేము నాశనమైనప్పుడు మీరు సంతోషపడ్డారు. మీరు మీ చేతులు చరిచి, కాళ్లు దట్టించారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని అవమానపరుస్తూ మీరు వేడుక చేసుకున్నారు.


ఇశ్రాయేలు దేశం నాశనమయినప్పుడు నీవు సంతోషించావు. అదే రీతిని నిన్ను నేను చూస్తాను. శేయీరు పర్వతం, ఎదోము దేశం మొత్తం నాశనం చేయబడతాయి. నేనే యెహోవానని మీరప్పుడు తెలుసుకుంటారు.”


“నా తీవ్రమైన భావాలను ఇప్పుడు నిజంగా వ్యక్తం చేస్తున్నాను! ఎదోము, తదితర దేశాలు నా కోపాన్ని చవి చూసేలా చేస్తాను. ఎదోమీయులు నా భూమిని తమ స్వంతం చేసుకున్నారు. వాళ్ళు బాగా సంతోషంగా అనుభవించారు. వారా విధంగా సంతోషంతో ఉన్నప్పుడు ఈ భూమిని ఎలా అసహ్యించు కొనేవారో తెలిపారు. వారు ఈ భూమిని నాశనం చేసి దాన్ని స్వాధీన పరచుకోదలిచారు.”


“దావీదు గుడారం పడిపోయింది. కాని నేను దానిని తిరిగి నిలబెడతాను. గోడల కంతలు పూడ్చుతాను. శిథిలమైన భవనాలను తిరిగి నిర్మిస్తాను. దానిని పూర్వమున్నట్లు నిర్మిస్తాను.


నీ సోదరుని కష్టకాలం చూసి నీవు నవ్వావు. నీవాపని చేసియుండకూడదు. ఆ జనులు యూదాను నాశనం చేసినప్పుడు నీవు సంతోషించావు. నీవలా చేసియుండకూడదు. యూదా ప్రజల కష్టకాలంలో నీవు గొప్పలు చెప్పుకున్నావు. నీవది చేసియుండకూడదు.


సీయోను కుమారీ, నీవు బాధపడు. ప్రసవించే స్త్రీలా నీవు నొప్పిని అనుభవించి “బిడ్డను” కను. ఎందుకంటే నీవు (యెరూషలేము) నగరాన్ని ఇప్పుడు వదిలివేస్తావు. నీవు వెళ్లి పొలంలో నివసిస్తావు. నీవు బబులోను (బాబిలోనియా)కు వెళతావు. కానీ నీవక్కడనుండి రక్షింపబడతావు. యెహోవా అక్కడికి వెళ్లి, నిన్ను నీ శత్రువులనుండి తిరిగి తీసుకొని వస్తాడు.


నా శత్రువు ఇది చూసి సిగ్గుపడతాడు. “నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా శత్రువు నన్నడిగాడు. ఆ సమయంలో ఆమెను చూసి నేను నవ్వుతాను. వీధిలో మట్టిమీద నడిచినట్లు జనులు ఆమెమీద నడుస్తారు.


కాని యెరూషలేము ప్రజలను యెహోవా రక్షిస్తాడు. ఏమీ చేతగానివాడు సహితం దావీదులా గొప్ప సైనికుడవుతాడు. దావీదు వంశంలోని మనుష్యులు దేవుళ్లవలె వుంటారు. ప్రజలను నడిపించే యెహోవా దూతలా వుంటారు.


“అయితే నా అనుచరులారా, ఉదయిస్తున్న సూర్యునిలా, మంచితనం మీమీద ప్రకాశిస్తుంది. మరియు సూర్యకిరణాలవలె అది స్వస్థతా శక్తిని తెచ్చిపెడ్తుంది. పాకనుండి విడిచిపెట్టబడిన దూడల్లా, మీరు స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటారు.


చీకట్లో నివసిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూసారు! మృత్యుఛాయలు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై వెలుగు ప్రకాశించింది.”


మీరు దుఃఖిస్తున్నప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది. మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. ఇది నిజం.


యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు.


నీవు వాళ్ళని సత్యం అర్థం చేసుకొనేట్టు చేయగలవు. వాళ్ళు చీకటినుండి వెలుగుకు తిరుగుతారు. వాళ్ళు సాతాను శక్తినుండి మళ్ళుకొని దేవుని వైపు తిరుగుతారు. వాళ్ళు నన్ను విశ్వసించి తమ పాపాలకు క్షమాపణ పొందాలని, దేవుడు ఎన్నుకొన్నవాళ్ళతో కలిసి తమ స్థానం పొందాలని యిలా చేస్తున్నాను’అన్నాడు.


“చీకటి నుండి వెలుగు ప్రకాశించనీ!” అని అన్న దేవుడు తన వెలుగు మా హృదయాల్లో వెలిగించాడు. క్రీస్తు ముఖంలో దేవుని మహిమ ప్రకాశిస్తోంది. ఆ మహిమలో ఉన్న జ్ఞానాన్ని మాలో ప్రకాశింప చేసాడు.


మేము హింసించబడుతున్నాము కాని, మేము దిక్కులేనివాళ్ళము కాము. మేము క్రింద పడ్డాము కాని నశించిపోలేదు.


దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు.


ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు. కనుక వాళ్ళకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ