మలాకీ 3:17 - పవిత్ర బైబిల్17 ఆ ప్రజలు నాకు చెందినవాళ్లు. నేను వారికి దయ చూపుతాను. ఒక మనిషి అతనికి విధేయులయ్యే పిల్లల యెడల చాలా దయగలిగి ఉంటాడు. అదే విధంగా, నేను నా అనుచరులయెడల దయగలిగి ఉంటాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 “నేను నియమించే రోజు సమీపించినప్పుడు వారు నావారుగా, నా ప్రత్యేక సొత్తుగా ఉంటారు. తండ్రి తనను సేవించే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 “నేను నియమించిన ఆ రోజున వారు నాకు విలువైన స్వాస్థ్యంగా ఉంటారు. తండ్రి తనను సేవించే తన కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరిస్తాను” అని అంటూ సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 “నేను నియమించిన ఆ రోజున వారు నాకు విలువైన స్వాస్థ్యంగా ఉంటారు. తండ్రి తనను సేవించే తన కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరిస్తాను” అని అంటూ సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
దేవుడు ఇలా చెప్పుచున్నాడు: “ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని మీకు తెలుసు. ఆ బిడ్డను నేను ప్రేమిస్తున్నాను. అవును, నేను ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా తరచు మాట్లాడియున్నాను. అయినా నేను అతనిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నేనతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. నేను నిజంగా అతన్ని ఓదార్చ గోరుతున్నాను.” ఇది యెహోవా సందేశం.
చనిపోగా మిగిలినవారిని నేను పరీక్షిస్తాను. వారికి నేను ఎన్నో కష్టాలు కలుగ జేస్తాను. వెండిని శుద్ధి చేయటానికి కాల్చబడే అగ్నిలా ఆ కష్టాలు వుంటాయి. ఒకడు బంగారాన్ని పరీక్ష చేసినట్లు నేను వారిని పరీక్ష చేస్తాను. అప్పుడు సహాయం కొరకు వారు నన్ను పిలుస్తారు. నేను వారికి సమాధానమిస్తాను. ‘మీరు నా ప్రజలు’ అని నేను అంటాను. అప్పుడు వారు ఇలా అంటారు: ‘యెహోవా మా దేవుడు.’”
“పిల్లలు తమ తండ్రిని గౌరవిస్తారు. సేవకులు తమ యజమానులను గౌరవిస్తారు. నేను మీ తండ్రిని. మరి మీరెందుకు నన్ను గౌరవించరు? నేను మీ యజమానిని. అయినను నేనంటే భయభక్తులు ఎందుకు లేవు మీకు? యాజకులారా, మీరు నా పేరును అగౌరవపరుస్తున్నారు” అని సర్వశక్తిమంతుడైన యెహోవా అన్నాడు. కాని మీరు, “మేము నీ పేరును అగౌరవపరచామని చూపించడానికి మేము ఏమి చేశాం?” అని అంటారు.