Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 4:2 - పవిత్ర బైబిల్

2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ప్రమాదవశాత్తు ఎవరైనా పాపం చేసి, చేయకూడదని యెహోవా చెప్పిన వాటిని చేస్తే, అప్పుడు అతడు ఇలా చేయాలి:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము– యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనివిషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైనయెడల, ఎట్లనగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాల్లో దేనినైనా పొరపాటున ఎవరైనా చేస్తే, మీరిలా చేయండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా అనుకోకుండ పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేసినప్పుడు ఇలా చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా అనుకోకుండ పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేసినప్పుడు ఇలా చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 4:2
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిచి, అతనితో అన్నాడు: “నీవు మాకు ఎందుకు ఇలా చేశావు? నీకు నేను ఏమి అపకారం చేశాను? ఎందుకలా అబద్ధం చెప్పి, ఆమె నీ సోదరి అన్నావు? నా రాజ్యానికి నీవు చాలా చిక్కు తెచ్చిపెట్టావు. నాకు నీవు ఇలా చేయకుండా ఉండాల్సింది.


యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు. కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.


యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము. ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము. నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.


అందుకని, నీ మాటలు పాపకారణం కాకుండా చూసుకో. “నేను అన్న మాట అర్థం అది కాదు!” అని నీ యాజకుడితో చెప్పబోకు. నీవాపని చేస్తే, దేవునికి నీ మాటల పట్ల కోపం రావచ్చు, నీవు శ్రమించి సాధించిన దాన్నంతటినీ నాశనం చెయ్యవచ్చు.


“ఒక వ్యక్తి పవిత్ర భోజనంలో కొంత పోరబాటున తిన్నట్లయితే ఆ వ్యక్తి అంత పవిత్ర భోజనాన్ని యాజకునికి ఇచ్చివేయాలి. అయిదింట ఒకటి వంతున ఆ భోజనం ఖరీదు గూడ అతడు చెల్లించాలి.


మోషేతో యెహోవా మాట్లాడి ఇలా అన్నాడు:


“ఒక వేళ ఇశ్రాయేలు జనులంతా తెలియకుండా పాపం చేయటం తటస్థించవచ్చు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా వారు చేసినట్లయితే వారు అపరాధులు అవుతారు.


“చేయకూడదని యెహోవా చెప్పిన ఆజ్ఞలలో దేనినైనా ఒక అధికారి పొరబాటున అతిక్రమన చేసినట్లయితే, అప్పడు ఆ అధికారి అపరాధి అవుతాడు.


“చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా ఒక సామాన్యుడు పొరబాటున చేయటం తటస్థించవచ్చు.


ఆశ్రయ పురాలుగా పట్టణాలను మీరు ఏర్పాటుచేయాలి. ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ మరో వ్యక్తిని చంపేస్తే, అప్పుడు అతడు భద్రత కోసం ఆ పట్టణాల్లో ఒకదానికి పారిపోవచ్చును.


“ఎవరినైనా చంపేసి భద్రతకోసం ఈ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయే మనిషికి నియమాలు ఇవి, అతడు ప్రమాదవశాత్తు మరొకరిని చంపినవాడై ఉండాలి. అతడు తాను చంపిన వ్యక్తిని ద్వేషించిన వాడు కాకూడదు.


ఒకనాడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కనికరించాడు.


ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు.


కాని ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తంతో ప్రవేశించేవాడు. తన పక్షాన, అజ్ఞానంతో పాపాలు చేసిన ప్రజల పక్షాన తప్పకుండా రక్తాన్ని తెచ్చి దేవునికి అర్పించేవాడు.


స్తుతి, శాపము ఒకే నోటినుండి సంభవిస్తున్నాయి. నా సోదరులారా! ఇది తప్పు.


అయితే సౌలు చేయించిన ఈ ప్రమాణం గురించి యోనాతానుకు తెలియదు. అతను తన చేతికర్రను తేనెతుట్టలోనికి గుచ్చి లాగగానే తేనెవచ్చింది. అతడు దానిని తాగగా అతనికి ఎంతో హాయినిచ్చింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ