Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 26:44 - పవిత్ర బైబిల్

44 వాస్తవంగా వారు పాపం చేసారు. అయితే సహాయంకోసం వారు నా దగ్గరకు వస్తే, నేను వారినుండి తిరిగిపోను. వారు వారి శత్రువుల దేశంలో ఉన్నప్పుటికీ నేను వారి మొర అలకిస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చెయ్యను. వారితో నా ఒడంబడికను తెగతెంపులు చేయను. నేను యెహోవాను, వారి దేవుణ్ణి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

44 అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారియందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

44 అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరించను. నా నిబంధనను భంగపరచి వారిని బొత్తిగా నశింపజేయడానికి వారిపై అసహ్యపడను. ఎందుకంటే నేను వారి దేవుడైన యెహోవాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

44 అయినప్పటికీ, వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు, వారితో నా నిబంధనను విచ్ఛిన్నం చేస్తూ, వారిని పూర్తిగా నాశనం చేసే విధంగా నేను వారిని తిరస్కరించను, అసహ్యించుకోను. నేను వారి దేవుడనైన యెహోవానై ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

44 అయినప్పటికీ, వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు, వారితో నా నిబంధనను విచ్ఛిన్నం చేస్తూ, వారిని పూర్తిగా నాశనం చేసే విధంగా నేను వారిని తిరస్కరించను, అసహ్యించుకోను. నేను వారి దేవుడనైన యెహోవానై ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 26:44
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీకు, నాకు మధ్య ఒక ఒడంబడికను నేను ఏర్పాటు చేస్తాను. నీ సంతానానికి ఈ ఒడంబడిక వర్తిస్తుంది. నేను నీకు దేవునిగా ఉంటాను. నీ సంతానానికి దేవునిగా ఉంటాను.


కాని యెహోవా ఇశ్రాయేలు వారిపట్ల దయ వహించాడు. యెహోవా దయాళుడు. ఇశ్రాయేలు వారివైపు తిరిగినాడు మరియు వారిని నాశనం చేయలేదు. ఎందుకంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ఒడంబడిక వల్ల, యెహోవా ఇశ్రాయేలు వారిని నాశనం చేయడు; ఇకను వారిని విసర్జించడు.


వాళ్లు నీ మాటలు తిరస్కరించారు. వాళ్లకు నీవు చేసిన ఆశ్చర్యకారాలను అద్భుతాలను మరిచారు. వాళ్లు మొండివారై ఎదురు తిరిగినప్పుడు, వాళ్లు మళ్లీ వెనుకకు తిరిగి బానిసలయ్యారు. “నీవు క్షమాశీలివి! నీవు దయామయుడివి. కరుణామయుడివి. నీవు ఓర్పుగలవాడివి. ప్రేమామయుడవు. అందుకే నీవు వాళ్లను విడువలేదు.


“అయితే, నీవెంతో దయామయుడివి! వాళ్లని నీవు సర్వనాశనం చేయలేదు. నీవు వాళ్లని విడువలేదు. నీవెంతో దయామయుడివి, దేవా, నీవెంతో కరుణామయుడివి!


తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు. అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.


కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను. నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.


యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.


యెహోవా, ఉన్నతమైన నీ నామము కొరకైనా మమ్మల్ని త్రోసివేయవద్దు! దివ్యమైన నీ సింహాసనపు గౌరవాన్ని తగ్గించవద్దు. మాతో నీవు చేసిన ఒడంబడికను గుర్తుంచుకోవాలి. ఆ నిబంధనను మరువవద్దు.


ఇశ్రాయేలు దేవుడైవ యెహోవా ఇలా చెప్పాడు: “యూదా ప్రజలు తమ దేశాన్నుండి బయటకు కొనిపోబడ్డారు. వారి శత్రువు వారిని బబులోనుకు తీసుకొనిపోయాడు. ఆ ప్రజలు ఈ మంచి అంజూరపండ్లలా ఉన్నారు. ఆ ప్రజల పట్ల నేను కనికరం చూపుతాను.


ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, నేను మీతో వున్నాను.!” ఇదే యెహోవా వాక్కు. “నేను మిమ్మల్ని రక్షిస్తాను. నేనే మిమ్మల్ని ఆయా దేశాలకు చెదరగొట్టాను. కాని ఆ రాజ్యాలను నేను పూర్తిగా నాశనం చేస్తాను. ఇది నిజం. నేనా దేశాలను నాశనం చేస్తాను. కాని నేను మిమ్మల్ని మాత్రం నాశనం చేయను. అయితే మీరు చేసిన దుష్కార్యాలకు మీరు తప్పక శిక్షింపబడాలి. నేను మిమ్మల్ని బాగా క్రమశిక్షణలోకి తెస్తాను.”


దేవుడు ఇలా చెప్పుచున్నాడు: “ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని మీకు తెలుసు. ఆ బిడ్డను నేను ప్రేమిస్తున్నాను. అవును, నేను ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా తరచు మాట్లాడియున్నాను. అయినా నేను అతనిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నేనతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. నేను నిజంగా అతన్ని ఓదార్చ గోరుతున్నాను.” ఇది యెహోవా సందేశం.


బహుశః అప్పుడు యాకోబు సంతతి నుండి నేను దూరంగా ఉంటాను. బహుశః అప్పుడే నేను దావీదు వంశం వారు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారిని ఏలకుండా చేస్తాను. కానీ నిర్బంధంలో నుండి వారిని మరలా వారి స్వదేశానికి తెస్తాను. ఆ ప్రజల పట్ల దయగలిగి ఉంటాను.”


నీవు యౌవ్వన వయస్సులో వున్నప్పుడు మనం చేసుకొన్న నిబంధన నాకు జ్ఞాపకం ఉంది. నేను నీతో సదా కొనసాగే ఒక నిబంధన చేసుకొన్నాను!


నేను నా పవిత్ర గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి నేను తిరిగిపోను.


తనకు ముందే తెలిసిన ప్రజల్ని దేవుడు నిరాకరించలేదు. లేఖనాల్లో ఏలీయాను గురించి ఏమని వ్రాసారో మీకు తెలియదా? అతడు ఇశ్రాయేలు వంశీయులపై నేరారోపణ చేస్తూ దేవునితో ఈ విధంగా విన్నవించుకొన్నాడు:


శాస్త్రాల్లో వ్రాసినట్లు ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా రక్షింపబడతారు: “రక్షకుడు సీయోను నుండి వస్తాడు; అతడు యాకోబు వంశీయుల్లో ఉన్న చెడును తొలగిస్తాడు.


యెహోవాదూత గిల్గాలు పట్టణం నుండి బోకీము పట్టణానికి వెళ్లాడు. యెహోవా నుండి వచ్చిన ఒక సందేశాన్ని ఆ దూత ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. ఇదే ఆ సందేశం: “నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చాను. నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి నేను మిమ్మల్ని నడిపించాను. మీతో నేను చేసిన నా ఒడంబడికను నేను ఎన్నడూ ఉల్లంఘించను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ