30 అయితే ఒక సంవత్సరం పూర్తయ్యేలోపల ఆ ఇంటి స్వంతదారుడు కొనక పోయినట్టయితే, అప్పుడు ప్రాకారంగల పట్టణంలోని ఆ ఇల్లు, దానిని కొన్నవానికి, అతని సంతానానికి స్వంతం అవుతుంది. బూరధ్యని చేసే మహోత్సవ సమయంలో ఆ యిల్లు తిరిగి దాని ప్రథమ స్వంత దారుని వశం కాదు.
30 అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లుకొనినవానికి వాని తరతరములకు అది స్థిరముగానుండును. అది సునాద కాలమున తొలగిపోదు.
30 అయితే ఆ సంవత్సరం నిండే లోగా దాన్ని విడిపించుకోకపోతే ప్రాకారం ఉన్న ఊళ్ళోని ఆ ఇల్లు కొనుక్కున్న వాడికే తరతరాలకు ఉండిపోతుంది. అది సునాద సంవత్సరంలో మొదటి యజమాని ఆధీనంలోకి తిరిగి రాదు.
30 ఒకవేళ సంవత్సరం పూర్తిగా గడిచే లోపు దానిని విడిపించకపోతే, ప్రాకారం కలిగిన పట్టణంలోని ఇల్లు శాశ్వతంగా కొనుగోలుదారునికి, అతని వారసులకు చెందుతుంది. ఇది యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడదు.
30 ఒకవేళ సంవత్సరం పూర్తిగా గడిచే లోపు దానిని విడిపించకపోతే, ప్రాకారం కలిగిన పట్టణంలోని ఇల్లు శాశ్వతంగా కొనుగోలుదారునికి, అతని వారసులకు చెందుతుంది. ఇది యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడదు.
అయితే ఈ వ్యక్తి ఆ భూమిని తిరిగి తనకోసం కొనేందుకు సరిపడినంత డబ్బు అతని వద్ద లేకపోతే, అతడు అమ్మి వేసిన భూమి, వచ్చే బూరధ్వని చేసే మహోత్సవకాలం వరకు దానిని కొన్న వారి స్వాధీనంలోనే ఉంటుంది. అప్పుడు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో ఆ భూమి దాని మొదటి స్వంతదారుల పరం అవుతుంది. కనుక ఆ ఆస్తి తిరిగి దాని అసలైన కుటుంబానికి చెందుతుంది.
“ప్రాకారంగల పట్టణంలో ఒకడు తన ఇల్లు అమ్మినట్టయితే, ఆ తర్వాత ఒక పూర్తి సంవత్సరం పాటు ఆ ఇల్లును తిరిగి పొందే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది. ఇంటిని తిరిగి పొందే హక్కు ఒక సంవత్సరంవరకు కొనసాగుతుంది.
ప్రాకారాలు లేని పట్టణాలు బహిరంగ పొలాల్లా గుర్తించ బడతాయి. కనుక అలాంటి పట్టణాల్లో నిర్మించబడిన ఇళ్లు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో తిరిగి వాటి ప్రథమ స్వంత దారులపరం అవుతాయి.