లేవీయకాండము 23:18 - పవిత్ర బైబిల్18 “ప్రజలు ధాన్యార్పణతో బాటు ఒక దూడను ఒక పొట్టేలును, ఏడాది పోతును, ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి. వాటిలో ఏ దోషమూ ఉండకూడదు. అవి యెహోవాకు దహనబలి అర్పణ. అవి హోమంగా అర్పించబడి, యెహోవాకు కమ్మని సువాసనగా ఉంటాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లలు ఏడింటిని, ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పించాలి. అవి వారి నైవేద్యాలతోను వారి పానార్పణాలతోను దహనబలిగా యెహోవాకు పరిమళ హోమం అవుతుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఈ రొట్టెతో పాటు లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను, ఒక చిన్న ఎద్దును, రెండు పొట్టేళ్లను సమర్పించాలి. భోజనార్పణలు, పానార్పణలతో పాటు అవి యెహోవాకు దహనబలిగా ఉంటాయి, అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఈ రొట్టెతో పాటు లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను, ఒక చిన్న ఎద్దును, రెండు పొట్టేళ్లను సమర్పించాలి. భోజనార్పణలు, పానార్పణలతో పాటు అవి యెహోవాకు దహనబలిగా ఉంటాయి, అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి. အခန်းကိုကြည့်ပါ။ |