లేవీయకాండము 22:13 - పవిత్ర బైబిల్13 ఒక యాజకుని కుమార్తె విధవరాలు కావచ్చును, లేదా విడాకులు పొందవచ్చును. ఆమెను పోషించే పిల్లలు ఆమెకు లేని కారణంగా ఆమె బాల్యంలో నివసించిన తన తండ్రి ఇంటికి తిరిగి వేళ్తే, అప్పుడు ఆమె తన తండ్రి భోజనంలో కొంత తినవచ్చును. అయితే యాజక కుటుంబంలోని వారు మాత్రమే ఈ భోజనాన్ని తినవచ్చును. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 యాజకుని కుమార్తెలలో విధవరాలేకాని విడనాడబడినదే కాని సంతానము లేనియెడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి యింటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చునుగాని అన్యుడెవడును దాని తినకూడదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 యాజకుని కుమార్తెల్లో వితంతువుగానీ, విడాకులు తీసుకున్నది గానీ పిల్లలు పుట్టక పోవడం వల్ల ఆమె తన బాల్యప్రాయంలో వలె తన తండ్రి యింటికి తిరిగి చేరితే తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు. అన్యుడు మాత్రం దాన్ని తినకూడదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఒక యాజకుని కుమార్తె విధవరాలు అయితే లేదా విడాకులు తీసుకుంటే, ఇంకా పిల్లలు లేకుండా ఆమె యవ్వనురాలై తన తండ్రి ఇంట్లో నివసించడానికి తిరిగి వస్తే, ఆమె తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు గాని ఏ అనధికార వ్యక్తి దానిని తినకూడదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఒక యాజకుని కుమార్తె విధవరాలు అయితే లేదా విడాకులు తీసుకుంటే, ఇంకా పిల్లలు లేకుండా ఆమె యవ్వనురాలై తన తండ్రి ఇంట్లో నివసించడానికి తిరిగి వస్తే, ఆమె తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు గాని ఏ అనధికార వ్యక్తి దానిని తినకూడదు. အခန်းကိုကြည့်ပါ။ |
“మరియు నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నైవేద్యంల్లోనుంచి బోరను తినవచ్చును. మీరు వాటిని పవిత్ర స్థలంలో తినాల్సిన అవసరం లేదు గాని పరిశుభ్రమైన స్థలంలో తినాలి. ఎందుచేతనంటే అవి సమాధాన బలిలోనివి. ఆ కానుకలను ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇస్తారు. ఆ జంతువుల్లో కొంత భాగాన్ని ప్రజలు తింటారు కాని బోర మాత్రం మీ వంతు అవుతుంది.