Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 20:23 - పవిత్ర బైబిల్

23 ఇతర ప్రజల్ని ఆ దేశంలో నుండి నేను వెళ్ల గొట్టేస్తున్నాను. ఎందుచేతనంటే వాళ్లు అలాంటి పాపాలన్నీ చేసారు. ఆ పాపాలంటే నాకు అసహ్యం. కనుక వాళ్లు జీవించినట్టు మీరు జీవించకండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములనుబట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 నేను మీ ఎదుట నుండి వెళ్లగొడుతున్న జాతుల ఆచారాల ప్రకారం నడుచుకోకూడదు. వారు అలాటి క్రియలన్నీ చేశారు కాబట్టి నేను వారిని అసహ్యించుకున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 నేను మీ ఎదుట నుండి వెళ్లగొట్టబోయే జనాల ఆచారాల ప్రకారం మీరు జీవించకూడదు. వారు అలాంటివి చేశారు కాబట్టి నేను వారిని అసహ్యించుకున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 నేను మీ ఎదుట నుండి వెళ్లగొట్టబోయే జనాల ఆచారాల ప్రకారం మీరు జీవించకూడదు. వారు అలాంటివి చేశారు కాబట్టి నేను వారిని అసహ్యించుకున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 20:23
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుడు ఇది విని చాలా కోపగించాడు. మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు.


“ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను యెహోవాను, మీ దేవుణ్ణి.


“అలాంటి వాటిలో దేనిమూలంగాను మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. నేను జనాలను వారి దేశాలనుండి వెళ్లగొట్టి, వారి దేశాలను నేను మీకు యిస్తున్నాను. ఎందుచేతనంటే ఆ ప్రజలు ఆ చెడుకార్యాలు చేసారు.


కనుక దేశం మైలపడిపోయింది. అలాంటి కార్యాలతో ఇప్పుడు దేశం రోగభూయిష్టమయింది. మరియు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం ఇప్పుడు వెళ్లగొడుతుంది!


ఆ దేశంలో మీకు ముందు నివసించిన ప్రజలు ఆ భయంకర సంగతులన్నీ జరిగించారు. అందుచేత దేశం మైలపడింది.


గతంలో మీరు ఈజిప్టులో జీవించారు. ఆ దేశంలో జరిగించిన వాటిని మీరు ఇప్పుడు చేయకూడదు. నేను మిమ్మల్ని కనానుకు నడిపిస్తున్నాను. ఆ ప్రజల ఆచారాలను పాటించవద్దు.


ఇతరులు ఆ భయంకర పాపాలు చేశారు. కాని మీరు మాత్రం నా ఆజ్ఞలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలేవీ మీరు చేయకూడదు. ఆ భయంకర పాపాలతో మిమ్మల్ని మీరు మైల చేసుకోవద్దు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”


ముగ్గురు కాపరులను ఒక్క నెలలో సంహరించాను. నేను గొర్రెలపట్ల కోపించగా, వారు నన్ను ద్వేషించటం మొదలు పెట్టారు.


మీరు వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అందులో ప్రవేశిస్తున్నారంటే మీరేదో మంచివాళ్లు, నీతిగా బతుకుతున్నారు అని కాదు. వాళ్లు చెడుమార్గాలలో జీవించడంవల్లనే మీ దేవుడైన యెహోవా వాళ్లను బయటకు వెళ్లగొడుతున్నాడు, మీరు లోనికి వెళ్తున్నారు. మరియు మీ పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా చేసిన వాగ్దానం నెరవేరాలని ఆయన కోరుచున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ