Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 19:15 - పవిత్ర బైబిల్

15 “తీర్పు విషయంలో మీరు న్యాయంగా ఉండాలి. పేదవాళ్ళకి ప్రత్యేకంగా పక్షపాతం చూపెట్టకూడదు. ప్రముఖులనీ పక్షపాతం చూపెట్ట కూడదు. మీ పొరుగు వారికి తీర్పు చెప్పేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అన్యాయ తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చూపకూడదు. గొప్పవాడని అభిమానం చూపకూడదు. నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 “ ‘తీర్పును వక్రీకరించకండి; బీదవారికి పక్షపాతం చూపకూడదు లేదా గొప్పవారిని అభిమానం చూపకూడదు, కాని మీ పొరుగువారికి న్యాయమైన తీర్పు తీర్చండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 “ ‘తీర్పును వక్రీకరించకండి; బీదవారికి పక్షపాతం చూపకూడదు లేదా గొప్పవారిని అభిమానం చూపకూడదు, కాని మీ పొరుగువారికి న్యాయమైన తీర్పు తీర్చండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 19:15
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీరు నాకు విరోధంగా దేవుని ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారా? న్యాయస్థానంలో మీరు దేవుని ఆదుకొంటారా?


ఈ వాదంలో నేను ఎవరి పక్షమూ వహించను. నేను ఎవరినీ పొగడను. నేనేమి చెప్పాలో దానిని చెబుతాను.


దేవుడు నాయకులను మనుష్యులకంటె ఎక్కువేమీ ప్రేమించడు. దేవుడు ధనికులను దరిద్రుల కంటే ఎక్కువేమీ ప్రేమించడు. ఎందుకంటే, ప్రతి మనిషినీ దేవుడే చేశాడు గనుక.


ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు? దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.


అయితే, “ప్రజల్లోనుంచి మంచి మనుష్యుల్ని నీవు ఏర్పాటు చేసుకోవాలి. డబ్బుకోసం నిర్ణయాలు మార్చుకోనటువంటి మనుష్యుల్ని ఏర్పాటు చేసుకో.” “వీళ్లను ప్రజల మీద పరిపాలకులుగా చేయి. 1,000 మంది 100 మందికి, 50 మందికి, చివరికి 10 మందికి పైన పరిపాలకులు ఉండాలి.


ఒకడు నేరస్థుడైతే వానికి సహాయం చేయవద్దు. అతడు తప్పు ఏమీ చేయకపోతే అతని యెడల న్యాయంగా ఉండు.


ఇవి జ్ఞానుల మాటలు: ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. ఒకడు తనకు తెలిసినవాడైనంత మాత్రాన అతడుఆయన అతనిని బలపరచకూడదు.


సరైనవి అని నీకు తెలిసిన విషయాల కోసం నీవు నిలబడు. మనుష్యులందరికీ న్యాయంగా తీర్పు తీర్చు. పేద ప్రజల, నీ అవసరం ఉన్న ప్రజల హక్కులను కాపాడు.


“ప్రజలు తీర్పు తీర్చేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి. అలానే వస్తువుల్ని తూచేటప్పుడు, కొలిచేటప్పుడ మీరు న్యాయంగా ఉండాలి.


పైన చూసి తీర్పు చెప్పటం మానుకోండి. న్యాయంగా తీర్పు చెప్పండి.”


అప్పుడు పౌలు అతనితో, “దేవుడు నీ నోరు మూయిస్తాడు. నీవు సున్నం కొట్టిన గోడవి. ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్పు చెప్పటానికి నీవక్కడ కూర్చున్నావు. కాని నన్ను కొట్టమని ఆజ్ఞాపించి నీవా ధర్మశాస్త్రాన్నే ఉల్లంఘిస్తున్నావు” అని అన్నాడు.


మీరు విచారణ జరిపేటప్పుడు ఒక వ్యక్తి మరో వ్యక్తికంటె ముఖ్యమైనవాడని మీరు తలచకూడదు. ప్రతివ్యక్తి పైనా ఒకే విధంగా విచారణ జరిగించాలి. మీ నిర్ణయం దేవుని నుండి వస్తుంది. కనుక, ఎవరిని గూర్చి భయపడవద్దు. అయితే మీరు విచారణ జరిపేందుకు ఒక వ్యాజ్యము కష్టతరంగా ఉంటే, దానిని నా దగ్గరకు తీసుకొని రండి. నేను దానిని విచారిస్తాను.’


ఎందుకంటే యెహోవా మీ దేవుడు గనుక. ఆయన దేవుళ్లకు దేవుడు. ప్రభువులకు ప్రభువు. ఆయనే మహా దేవుడు. ఆయన అద్భుతమైన మహా శక్తిగల పరాక్రమశాలి. యెహోవాకు ప్రతి మనిషీ సమానమే. ఆయన లంచం తీసుకోడు.


న్యాయ తీర్పును మీరు మార్చకూడదు. మీరు కొందరియెడల పక్షపాతం చూపించకూడదు. ఒక తీర్పులో మీ మనసు మార్చుకొనేందుకు మీరు డబ్బు తీసుకోకూడదు. డబ్బు జ్ఞానుల కళ్లను గుడ్డివి చేస్తుంది, ఒక మంచి వ్యక్తి చెప్పేదానిని మార్చేస్తుంది.


“అప్పుడు లేవీయులు ‘విదేశీయులకు, అనాథలకు, విధవలకు న్యాయంగా తీర్పు చెప్పనివాడు శాప గ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ