Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 5:8 - పవిత్ర బైబిల్

8 బానిసలు మాకు పాలకులయ్యారు. వారినుండి మమ్మల్ని రక్షించటానికి ఎవ్వరూ లేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 దాసులు మాకు ప్రభువులైరివారి వశమునుండి మమ్మును విడిపింపగలవాడెవడును లేడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 దాసులు మమ్మల్ని ఏలుతున్నారు. వాళ్ళ వశం నుంచి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరూ లేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 బానిసలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 బానిసలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 5:8
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

కనుక నోవహు అన్నాడు: “కనాను శపించబడును గాక! కనాను తన సోదరులకు బానిస అగును గాక!”


హారోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ ఉద్యోగి టోబీయా, అరబీయుడైన గెషెము మేము తిరిగి నిర్మాణం సాగిస్తున్నామన్న విషయం విన్నారు. వాళ్లు మమ్మల్ని, “ఏమిటి మీరు చేస్తున్న పని? రాజు మీదే తిరుగుబాటు చెయ్యబోతున్నారా?” అంటూ చెడుగా ఎగతాళి చేశారు.


కాని, నా కంటె ముందు పాలించిన అధికార్లు జన జీవితాన్ని ఎక్కువ భారం చేశారు. వాళ్లు ప్రతి ఒక్కరినుంచీ నిర్బంధంగా నలభై తులాల వెండిని వసూలు చేశారు. అంతేకాదు, వాళ్లు జనం నుంచి తమ ఆహారాన్నీ, ద్రాక్షారసాన్నీ రాబట్టుకున్నారు. ఆ అధికార్ల కింది నాయకులు కూడా జనం మీద అధికారం చలాయించి, వాళ్ల జీవితాన్ని మరింత దుర్భరం చేశారు. కాని నేను అందుకు భిన్నంగా దేవునియందు భయభక్తులతో వ్యవహరించాను, అందుకే నేను వాళ్లు చేసిన పనులేవీ చేయలేదు.


కానీ నేను నిర్దోషిని అని నీకు తెలుసు. అయితే నీ శక్తినుండి నన్ను ఎవ్వరూ రక్షించలేరు!


ఆ బుద్ధిహీనుని పిల్లలు క్షేమంగా లేరు. (న్యాయ స్థానంలో) వారిని ఆదుకొనేందుకు నగరద్వారం వద్ద ఎవ్వరూలేరు.


నేను మిమ్ములను చీల్చివేయకముందే, దేవుని మరచిన జనాంగమైన మీరు, ఈ విషయమును గూర్చి ఆలోచించాలి. అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.


నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను. నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు.


రాజైన ఒక సేవకుడు, తనకు కావాల్సినవి అన్నీ కలిగి ఉన్న ఒక బుద్ధిహీనుడు,


“నేను ఎల్లప్పుడూ దేవునిగానే ఉన్నాను. నేనేదైనా చేశాను అంటే నేను చేసిన దానిని ఎవరూ మార్చలేరు. నా శక్తి నుండి మనుష్యులను ఎవ్వరూ రక్షించలేరు.”


కాని ఇప్పుడు నేను ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమె ప్రేమికులు ఆమె నగ్నత్వాన్ని చూస్తారు. నా శక్తినుండి ఆమెను ఎవ్వరూ తప్పించలేరు.


ఈ దేశంలో నివసించే ప్రజల కొరకు నేను విచారించను.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “చూడండి, నేను ప్రతివాడినీ తన పొరుగువానిచేత, రాజుచేత దూషింపబడేటట్లు చేస్తాను. వారి దేశాన్ని నాశనం చేసేలాగు నేను వారిని వదులుతాను. నేను వారిని ఆపను!”


మీ మధ్య నివసించే విదేశీయులు మరింత ఎక్కువ అధికారం కూడ పొందుతారు. మీరేమో మీకు ఉన్న అధికారం కూడ పోగొట్టుకొంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ